ఫార్మా దిగ్గజం జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ సంస్థ తయారుచేసిన కరోనా వైరస్ వ్యాక్సిన్ (Johnson and Johnson COVID-19 vaccine) ఆశలు రేపుతోంది. ప్రాథమిక, మధ్య దశ క్లినికల్ ట్రయల్స్‌లో ఈ సంస్థ రూపొందించిన కోవిడ్19 వ్యాక్సిన్ (COVID-19 vaccine) అద్భుత ఫలితాలు ఇచ్చిందని సెప్టెంబర్ 25న ప్రకటించారు. ప్రస్తుతం మార్కెట్లోకి విడుదలైన, విడుదలకు సిద్ధంగా ఉన్న కరోనా వ్యాక్సిన్‌ (CoronaVirus Vaccine)లకు ఇది భిన్నమైదనని, కేవలం సింగిల్ వ్యాక్సిన్ డోస్ ద్వారా కరోనాను అంతం చేయవచ్చునని రీసెర్చర్స్ ధీమా వ్యక్తం చేశారు. 



 


ఏడీ26.సీఓవీ2.ఎస్ వ్యాక్సిన్‌ సింగిల్‌ డోస్‌ ఇస్తే కరోనాను ఎదుర్కొనే యాంటీబాడీలు భారీగా అభివృద్ధి చెందాయని తెలిపారు. 18 ఏళ్ల వారితో పాటు 60 ఏళ్ల వయసు వారిలోనే సత్ఫలితాలు వచ్చాయని, యాండీ బాడీస్ భారీగా ఏర్పడ్డాయని జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ పేర్కొంది. సెప్టెంబర్ 23 నుంచి మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించారు. డిసెంబర్ చివరికల్లా ప్రయోగాలు పూర్తయ్యే అవకాశం ఉంది. వచ్చే ఏడాది నుంచి జాన్సన్ కంపెనీ కోవిడ్19 వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సింగిల్ డోస్ ద్వారా ఫలితాలు రాబడుతున్న వ్యాక్సిన్ కనుక టీకా పంపిణీ సులభతరం అవుతుంది.



మోడెర్నా, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ వ్యాక్సిన్ అస్ట్రాజెనెకా, పిఫిజర్ అండ్ బయోఎన్‌టెక్‌లకు జాన్సన్ కంపెనీ తయారుచేస్తున్న కరోనా టీకా భిన్నమని చెబుతోంది. ఆ మూడు టీకాలు తొలి డోస్ తీసుకున్న మూడు, నాలుగు వారాల తర్వాత రెండో డోస్ ఇవ్వాల్సి ఉంటుందని, కానీ జాన్సన్ కంపెనీ కరోనా వ్యాక్సిన్ సింగిల్ డోస్ ద్వారానే రోగనిరోధక శక్తి పెరుగుతుందని తెలిపింది. ఈ టీకాను కోతులపై ఇప్పటికే ప్రయోగం చేసి విజయవంతమైంది. 



ఫొటో గ్యాలరీలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe