Johnson & Johnson Talc Powder: అమెరికాకు చెందిన మెడికల్ ఉత్పత్తుల సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్ కీలక నిర్ణయం తీసుకుంది. జాన్సన్ బేబీ టాల్కమ్ పౌడర్ విక్రయాలను 2023 నుంచి ప్రపంచవ్యాప్తంగా నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. రెండేళ్ల క్రితమే జాన్సన్ అండ్ జాన్సన్ అమెరికా, కెనడాలో టాల్కమ్ పౌడర్ ఉత్పత్తులను నిలిపివేసింది. జాన్సన్ బేబీ టాల్కమ్ పౌడర్‌ను ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వాడుతున్నప్పటికీ.. అందులో ఓవరీస్ క్యాన్సర్ క్యాన్సర్‌కు దారితీసే ఆస్‌బెస్టాస్ ఉందనే ఆరోపణలున్నాయి. ఇవే ఆరోపణలతో జాన్సన్ సంస్థపై కోర్టుల్లో దాదాపు 38 వేల కేసులు దాఖలయ్యాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కోర్టు కేసుల కారణంగా టాల్కమ్ పౌడర్ విక్రయాలు కూడా బాగా పడిపోయాయి. టాల్కమ్ పౌడర్ అన్నివిధాలా సురక్షితమని, అందులో క్యాన్సర్ కారకాలు లేవని ఆ సంస్థ ఎన్నోమార్లు కోర్టులకు నివేదించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెడికల్ నిపుణుల దశాబ్దాల శాస్త్రీయ విశ్లేషణలో టాల్కమ్ పౌడర్ సురక్షితమని తేలిందని, అందులో ఆస్‌బెస్టాస్ లేదని, అది క్యాన్సర్‌కు దారితీయదని కోర్టులకు తెలిపింది. కానీ 1971 నుంచి 2000 వరకు జాన్సన్ బేబీ టాల్కమ్ పౌడర్‌లో కొద్దిమొత్తంలో ఆస్‌బెస్టాస్ ఉన్నట్లుగా ఆ కంపెనీ అంతర్గత రికార్డుల్లో పేర్కొన్నారనే వాదన ఉంది. దీనిపై 2018లో రాయిటర్స్ ఒక కథనాన్ని ప్రచురించింది. 


గతంలో అమెరికా, కెనడాల్లో జాన్సన్ టాల్కమ్ పౌడర్‌ను ఉపసంహరించుకున్నప్పుడు సేల్స్ తగ్గినందువల్లే దాని విక్రయాలను నిలిపివేస్తున్నట్లు జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ వెల్లడించింది. ఇకముందు తమ సంస్థకు చెందిన అన్ని పౌడర్ ప్రొడక్ట్స్‌లో టాల్కమ్ పౌడర్‌కు బదులు కార్న్ స్టార్చ్ ఉపయోగించాలని నిర్ణయించామని.. అందుకే జాన్సన్ బేబీ టాల్కమ్ పౌడర్‌ విక్రయాలను 2023 నుంచి నిలిపివేస్తున్నామని తాజాగా ప్రకటించింది.


జాన్సన్ బేబీ టాల్కమ్ పౌడర్‌లో క్యాన్సర్ కారకాలు ఉన్నాయా లేవా అనేది పక్కనపెడితే.. ప్రజలు ఆ ప్రొడక్ట్ విషయంలో అనేక సందేహాలు, సంకోచంతో ఉన్నారని మిచిగాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎరిక్ గోర్డాన్ పేర్కొన్నారు. జాన్సన్ నిర్ణయం సరైనదేనని ఆయన అభిప్రాయపడ్డారు.


Also Read: TS Eamcet 2022 Results: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల.. విద్యార్థులు రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి


Also Read: Kodak 7XPro: తక్కువ ధరలో బ్రాండ్ స్మార్ట్ టీవీ.. రూ.34 వేలు విలువ చేసే టీవీ కేవలం రూ.10,999కే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook