Kodak 7XPro: తక్కువ ధరలో బ్రాండ్ స్మార్ట్ టీవీ.. రూ.34 వేలు విలువ చేసే టీవీ కేవలం రూ.10,999కే..

Kodak 7XPro Smart TV at Low Price: తక్కువ బడ్జెట్‌లో బ్రాండ్ స్మార్ట్ టీవీ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది బెస్ట్ ఆఫర్ అని చెప్పొచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో కొడాక్ 7ఎక్స్‌ప్రో స్మార్ట్ టీవీపై భారీ తగ్గింపు అందుబాటులో ఉంది.

Written by - Srinivas Mittapalli | Last Updated : Aug 12, 2022, 10:36 AM IST
  • ఫ్లిప్‌కార్ట్ లేటెస్ట్ ఆఫర్స్
  • స్మార్ట్ టీవీలపై ఫ్లిప్‌కార్ట్ భారీ తగ్గింపు
  • కొడాక్ 7ఎక్స్‌ప్రో స్మార్ట్ టీవీపై డిస్కౌంట్, ఎక్స్‌చేంజ్ ఆఫర్
Kodak 7XPro: తక్కువ ధరలో బ్రాండ్ స్మార్ట్ టీవీ.. రూ.34 వేలు విలువ చేసే టీవీ కేవలం రూ.10,999కే..

Kodak 7XPro Smart TV at Low Price: ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ పలు బ్రాండ్స్‌కి చెందిన స్మార్ట్ టీవీలపై బిగ్ డిస్కౌంట్స్, ఎక్స్‌చేంజ్ ఆఫర్స్ అందిస్తోంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో కొడాక్ 7ఎక్స్‌ప్రో (43 అంగుళాలు) ఎల్‌ఈడీ స్మార్ట్ టీవీపై 35 శాతం తగ్గింపుతో పాటు ఎక్స్‌చేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ ద్వారా సగం కన్నా తక్కువ ధరకే కొడాక్ స్మార్ట్ టీవీని సొంతం చేసుకోవచ్చు. కొడాక్ స్మార్ట్ టీవీపై ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

అసలు ధర ఎంత.. ఫ్లిప్‌కార్ట్‌లో డిస్కౌంట్ ఎంత..

కొడాక్ 7ఎక్స్‌ప్రో (43 అంగుళాలు) స్మార్ట్ టీవీ అసలు ధర రూ.33,999. కానీ ఫ్లిప్‌కార్ట్‌లో ఇది కేవలం రూ.21,999కే అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్న 35 శాతం డిస్కౌంట్‌తో రూ.12 వేలు వరకు ఆదా అవుతుంది. అంతేకాదు, ఈ స్మార్ట్ టీవీ కొనుగోలుకు బ్యాంక్ ఆఫ్ బరోడా, సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపుల జరిపినట్లయితే మరో రూ.3 వేలు వరకు తగ్గింపు పొందే అవకాశం ఉంటుంది. తద్వారా మరింత చౌకగా కేవలం రూ.18,999కే కొడాక్ స్మార్ట్ టీవీని కొనుగోలు చేయవచ్చు.

కొడాక్ స్మార్ట్ టీవీపై ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌చేంజ్ ఆఫర్ :

కొడాక్ 7ఎక్స్‌ప్రో (43 అంగుళాలు) స్మార్ట్ టీవీపై ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌చేంజ్ ఆఫర్ కింద గరిష్ఠంగా రూ.11 వేలు వరకు తగ్గింపు అందుబాటులో ఉంది. మీ స్మార్ట్ టీవీని ఎక్స్‌చేంజ్ చేసుకోవడం ద్వారా దాని కండిషన్‌ని బట్టి తగ్గింపు ధర పొందుతారు. ఒకవేళ పూర్తి ఆఫర్ లభించినట్లయితే రూ.21,999కి అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్ టీవీని కేవలం రూ.10,999కే కొనుగోలు చేయవచ్చు. నెలకు రూ.763 చెల్లించడం ద్వారా ఈఎంఐ పద్దతిలోనూ ఈ స్మార్ట్ టీవీని కొనుగోలు చేయొచ్చు.

కొడాక్ స్మార్ట్ టీవీ 7ఎక్స్‌ప్రో ఫీచర్స్ :

ఆపరేటింగ్ సిస్టమ్ : ఆండ్రాయిడ్ (గూగుల్ అసిస్టెంట్, క్రోమ్‌కాస్ట్ ఇన్‌బిల్ట్)
సపోర్టెడ్ యాప్స్: ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, యూట్యూబ్
రిజల్యూషన్ : అల్ట్రా హెచ్‌డీ (4కె)3840 x 2160 పిక్సెల్
సౌండ్ ఔట్‌పుట్ : 40 వాట్స్
రీఫ్రెష్ రేట్ : 60HZ

Also Read: Shivamogga Subbanna dies: ప్రముఖ గాయకుడు శివమొగ సుబ్బన్న కన్నుమూత

Also Read: International Youth Day 2022: ఇవాళ ఇంటర్నేషనల్ యూత్ డే.. ఈసారి థీమ్ ఇదే.. ఈరోజుకు ఉన్న ప్రాముఖ్యత, చరిత్ర మీకు తెలుసా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News