Kamala Harris elected US Vice President వాషింగ్టన్: భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ అమెరికాలో చరిత్ర సృష్టించారు. అగ్రరాజ్యంగా పేరున్న అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికవడంతో గతంలో ఏ మహిళకూ సాధ్యం కాని రికార్డును కమలా హ్యారిస్ సొంతం చేసుకున్నారు. ఇప్పటివరకు అమెరికాలో అంత అత్యున్నత స్థాయి పదవికి ఎన్నికైన తొలి భారతీయ సంతతికి చెందిన మహిళగా కమలా హ్యారిస్ రికార్డు సృష్టించారు. కమలా హ్యారిస్ ఖ్యాతి భారత సంతతి మహిళ అనే పేరుతో ఆగిపోలేదు. ఆ పదవికి ఎన్నికైన తొలి సౌత్ ఆసియన్-అమెరికన్ మహిళ కూడా ఆమె అయ్యారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read : US Elections: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బిడెన్ విజయం


నవంబర్ 3న అమెరికా అధ్యక్షుడు, ఉపాధ్యక్షఎన్నిక కోసం ఎన్నికలు జరగగా.. నాలుగు రోజుల పాటు భారీ ఉత్కంఠ మధ్య జరిగిన ఓట్ల లెక్కింపు ఫలితాలు కొద్దిసేపటి క్రితమే దాదాపు ఖరారయ్యాయి. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బిడెన్ ( Joe Biden ) అధ్యక్షుడిగా ఎన్నికవగా కమలా హ్యారిస్ ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. జో బిడెన్ గెలుపుతో ప్రస్తుత అధ్యక్షుడు  డోనాల్డ్ ట్రంప్ ( Donald trump ) ఇక అమెరికా అధ్యక్షుడి హోదా నుంచి దిగిపోనున్నారు.


Also read : US Presidents: అమెరికా అధ్యక్షుల గురించి ఆసక్తికర విషయాలు


జనవరి 20న జో బిడెన్ అమెరికా అధ్యక్షుడిగా, క్యాలిఫోర్నియా సెనేటర్ కమలా హ్యారిస్ ఉపాధ్యక్షురాలిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. నాలుగేళ్ల క్రితం హిలరీ క్లింటన్ ఓటమితో డీలాపడిన మహిళలు అందరికీ కమలా హ్యారిస్ ( Kamala Harris ) విజయం పునరుత్తేజితం చేస్తుందని అమెరికన్స్ అభిప్రాయపడుతున్నారు. 


Also read : US Election Results: ఆ నాలుగు రాష్ట్రాల్లోనూ జో బిడెన్‌దే ఆధిక్యం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe