North Korea: నిండుసభలో కన్నీళ్లు పెట్టుకున్న కొరియా నియంత
నార్త్ కొరియా ( North Korea ) నియంత కిమ్ జోంగ్ ఉన్ ఎప్పుడు ఎలా ఉంటాడో ఎవరికీ అర్ధం కాదు. కొన్ని సార్లు తనను రెచ్చగొడితే బాగుండదు అని వివిధ దేశాలకు వార్నింగ్ ఇస్తుంటాడు. మరోసారి అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అన్నట్టుగా ప్రవర్తిస్తుంటాడు.
నార్త్ కొరియా ( North Korea ) నియంత కిమ్ జోంగ్ ఉన్ ఎప్పుడు ఎలా ఉంటాడో ఎవరికీ అర్ధం కాదు. కొన్ని సార్లు తనను రెచ్చగొడితే బాగుండదు అని వివిధ దేశాలకు వార్నింగ్ ఇస్తుంటాడు. మరోసారి అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అన్నట్టుగా ప్రవర్తిస్తుంటాడు. తాజాగా ఉత్తర కొరియాలో జరిగిన పరేడ్ సమయంలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన కిమ్.. కన్నీళ్లు పెట్టుకున్నాడు. ప్రజలు తనపై పెట్టుకున్న ఆశలను నెరవేర్చలేకపోయినందుకు సిగ్గుపడుతున్నానని తెలిపాడు.
ALSO READ | RGV : ఒబామా, ట్రంప్ మధ్య తేడాలేంటో చెప్పే ఆర్జీవి వీడియో
దేశంలో ఎవరికీ కరోనావైరస్ ( Coronavirus ) సోకకపోవడం అనేది సంతోషాన్ని కలిగించే అంశం అని..ప్రస్తుతం ఉన్న సమస్యల నుంచి దేశాన్ని గట్టెక్కిండానికి అన్ని ప్రయత్నాలు చేస్తానని తెలిపాడు కిమ్. అదే సమయంలో ఇప్పటి దాకా తను ప్రయత్నం చేసి సాధించలేని అంశాల విషయంలో సిగ్గుపడుతున్నాని అని తెలిపాడు. దేశ రక్షణ వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేస్తానని స్పష్టం చేశాడు.
తను స్పీచు ముగించే సమయంలో కరోనావైరస్ ప్రమాదం నుంచి ప్రపంచం బయటపడిన తరువాత ఉత్తర కొరియా, దక్షిణ కొరియా దేశాల మధ్య బంధం మరింత పటిష్టం అయ్యేలా ప్రయత్నిస్తానని తెలిపాడు కిమ్ .
ALSO READ | UPSC Notification 2020: ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన యూపీఎస్సీ
కిమ్ జోంగ్ ఉన్ ( Kim Jong Un ) ఇలా మారాడానికి కారణం ప్రపంచం మొత్తం, ముఖ్యంగా ఉత్తర కొరియా ప్రజలకు అతను ఒక నరరూప రాక్షసుడిలా కనిపిస్తున్నాడు. ఈ ఇమేజ్ నుంచి బయటికి రావడానికి ఇలా ఇమోషనల్ టచ్ ఇస్తున్నాడని రాజకీయ నిపుణులు చెబుతున్నాడు. ఎలా అయితేనేం ఈ నియంతలో కూడా ఒక మనిషి ఉన్నాడు..అతను ఇప్పుడు బయటికి వచ్చాడు అని మరికొంత మంది అంటున్నారు.
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
IOS Link - https://apple.co/3loQYeR