Kite Flying Incident: శ్రీలంకలో తై పొంగల్ పండుగ సందర్భంగా ఆశ్చర్యకర సంఘటన ఒకటి జరిగింది. పండుగ సంప్రదాయం ప్రకారం ఆ రోజున ప్రజలను గాలిపటాలను ఎగురవేయడం ఆనవాయితీ. అయితే అదే సమయంలో అపశ్రుతి చోటుచేసుకుంది. గాలిపటాలను ఎగురవేస్తున్న ఓ బాలుడు.. గాలిపటంతో పాటు గాల్లోకి వెళ్లాడు. ఆ గాలిపటం ఏకంగా ఆ బాలుడ్ని 30 అడుగుల ఎత్తుకు తీసుకెళ్లింది. అయితే అదృష్టవశాత్తు ఆ బాలుడు భూమిపైకి క్షేమంగా వచ్చాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏం జరిగిందంటే?


శ్రీలంకలోని జాఫ్నా జిల్లాలోని పాయింట్ పెడ్రోలో తై పొంగల్ ఫెస్టివల్ సంబరాలు జరుగుతున్నాయి. పండుల సంప్రదాయం ప్రకారం ఆ గ్రామంలోని యువకులంతా గాలిపటాలు ఎగురవేసేందుకు ఊరి శివారులోకి వెళ్లారు. అందరూ గాలిపటాలను ఎగురవేశారు. ఐదుగురు కలిసి ఓ పెద్ద గాలిపటాన్ని ఎగురవేసేందుకు సిద్ధమయ్యారు. అనుకున్న విధంగా గాలిపటాన్ని విజయంవంతంగా ఎగురవేశారు. 


అయితే అనుకోకుండా ఆ ఐదుగురిలో నలుగురు గాలిపటం దారాన్ని వదిలేశారు. అదే సమయంలో బలమైన గాలులు వీయడం వల్ల ఆ దారాన్ని పట్టుకున్న మన్మోహన్ అనే బాలుడ్ని ఆ గాలిపటం అమాంతం గాల్లోకి తీసుకెళ్లింది. భారీ గాలిపటం కావడం వల్ల మన్మోహన్ ను సులభంగా గాల్లోకి తీసుకెళ్లింది. 



Courtesy: Ragu Vlogs


దాదాపుగా 30 అడుగుల ఎత్తుకు వెళ్లిన మన్మోహన్.. గాలి తీవ్రత తగ్గిన తర్వాత గాలిపటం దారం కిందికి వచ్చింది. ఆ తర్వాత చిన్నగా 10 అడుగుల ఎత్తుకు చేరుకోగానే.. ఆ గాలిపటం దారాన్ని మన్మోహన్ వదిలేశాడు. అయితే అంతటి ఎత్తు నుంచి కిందికి దూకడం వల్ల ఆ బాలుడికి స్వల్పంగా గాయాలయ్యాయి. ఆ ఘటన తర్వాత వెంటనే ఆ బాలుడ్ని స్థానిక ఆస్పత్రికి చేర్చి చికిత్స అందించారు.  


Also Read: Viral Video: మిరిండా పానీపురి-ద్యావుడా ఇదేమి కాంబినేషన్-యాక్ అంటున్న నెటిజన్లు


Also Read: Egg Prank Gone Wrong: అత్త తలపై కోడిగుడ్డు కొట్టిన కోడలు.. ఆ తర్వాత ఏం జరిగిదంటే?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి