London New Virus: లండన్‌లో మరో కొత్త వైరస్, గణనీయంగా పెరుగుతున్న కేసులు
London New Virus: కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని పీడిస్తూనే ఉంది. వైరస్ రూపాంతరం చెందుతూ కొత్త వేరియంట్లతో దాడి చేస్తోంది. దీనికితోడు మరో కొత్త వైరస్ లండన్‌లో వెలుగు చూడటం ఆందోళన కల్గిస్తోంది.
London New Virus: కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని పీడిస్తూనే ఉంది. వైరస్ రూపాంతరం చెందుతూ కొత్త వేరియంట్లతో దాడి చేస్తోంది. దీనికితోడు మరో కొత్త వైరస్ లండన్‌లో వెలుగు చూడటం ఆందోళన కల్గిస్తోంది.
కరోనా మహమ్మారి(Corona Pandemic)మొత్తం ప్రపంచాన్ని చుట్టేసింది. ప్రపంచమంతా కరోనా రక్కసి కోరల్లో చిక్కుకుంది. కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి ఏదో ఒక వైరస్ పట్టి పీడిస్తూనే ఉంది. ఇప్పుడు ఇంగ్లండ్‌లో వెలుగు చూసిన కొత్త వైరస్ ఆందోళన కల్గిస్తోంది. తాజాగా యూకేలో నోటికి సంబంధించిన నోరో వైరస్(Norovirus) వెలుగులోకి వచ్చింది. తక్కువ కాలంలోనే కేసుల సంఖ్య గణనీయంగా పెరిగినట్టు పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్ (England)వెల్లడించింది. గత ఐదు వారాల్లో154 మంది నోటి వైరస్ బారిన పడ్డారు. వేగంగా సంక్రమించే లక్షణమున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పీహెచ్ఈ హెచ్చరించింది. నోటి వైరస్ సోకినవారిలో ప్రదానంగా కడుపు నొప్పి, డయేరియా, వాంతులు, జ్వరం లక్షణాలు కన్పిస్తాయి. కడుపుపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
ముఖ్యంగా నర్శరీ, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్‌లో ఈ కేసులు ఎక్కువగా ఉన్నట్టు పీహెచ్ఈ తెలిపింది.ఈ వైరస్ సోకిన వ్యక్తి నుంచి, కలుషిత ఆహారం లేదా నీటి ద్వారా సంక్రమిస్తుంది. ఈ వ్యాధి లక్షణాలు 2-3 రోజులుంటాయని..ఇంకా ఎలాంటి మందు లేదని సీడీసీ(CDC)వెల్లడించింది. వాంతులు,విరేచనాలున్నప్పుడు పుష్కలంగా ద్రవ పదార్ధాల్ని తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
Also read: Baghdad Bomb Blast: ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో భారీ ఆత్మాహుతి దాడి, 35 మంది మృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook