షేర్ల ధరలు పెరగడం ఆమెను అత్యంత సంపన్న మహిళ ( World richest woman ) గా మార్చింది. మాకెంజీ స్కాట్ ( Mackenzie scott )..ఇప్పుడు ప్రపంచ ధనిక మహిళ ఈమెనే. ఆమె నికర విలువ ఇప్పుడు ఏకంగా 68 బిలియన్ డాలర్లు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


50 ఏళ్ల మాకెంజీ స్కాట్ ఇప్పుడు ప్రపంచంలోనే అతి సంపన్న మహిళగా అరుదైన ఖ్యాతి దక్కించుకున్నారు. బ్లూమ్ బర్గ్ ( Bloomberg ) విడుదల చేసే బిలియనీర్ నివేదిక ప్రకారం...రచయిత్రిగా, దాతగా ప్రాచుర్యం పొందిన మాకెంజీ స్కాట్ ఇప్పుడు ధనిక మహిళగా మారారు. ఇప్పటివరకూ నెంబర్ వన్ ధనిక మహిళగా ఉన్న లోరియల్ వారసురాలు ఫ్రాంకోయిస్ బెటెన్ కోర్డ్ మేయర్స్ ను మాకెంజీ స్కాట్ ( Mackenzie scott ) అధిగమించారు. వాస్తవానికి అమెజాన్ సీఈఓ బెజోస్ ( Amazon CEO Bejos ) తో మాకెంజీ స్కాట్ 2019లో విడాకులు తీసుకున్నారు. ఆ సందర్బంలో ఆమెకు అమెజాన్ షేర్లలో 35 బిలియన్ డాలర్లకంటే ఎక్కువ విలువైన 4 శాతం వాటా దక్కింది. ఇప్పుడు అమెజాన్ షేర్లు భారీగా పెరగడంతో మాకెంజీ స్కాట్ సంపద కూడా ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇంకేం….ప్రపంచం మహిళల్లో తొలి స్థానాన్ని..ఓవరాల్ గా 12వ స్థానాన్ని పొందారు. ఇప్పటికే 116 సంస్థలకు దాదాపు 1.7 బిలియన్ డాలర్లు విరాళంగా ఇచ్చి దాతగా పేరు తెచ్చుకున్నారు స్కాట్. 


గత మూడు నెలల వ్యవధిలో అమెజాన్ విలువ దాదాపు 28 శాతం పెరిగింది. ఈ ఏడాది ఇప్పటివరకూ 90 శాతం కంటే ఎక్కువగా పెరిగింది. దాంతో బెజోస్ సంపద 200 బిలియన్ డాలర్లకు చేరుకుని ప్రపంచ ధనికుడిగా నిలిపింది అతన్ని. Also read: COVID19 Vaccine: నవంబర్ 1 నుంచి అమెరికాలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ