America Elections: ప్రీ పోల్స్ నిజం కానున్నాయా...లేదా గతంలో జరిగినట్టే పల్టీ కొడతాయా
అమెరికాలో ఏం జరగబోతోంది.. ప్రీపోల్స్ అన్నీ జో బైడెన్ కే మొగ్గుచూపుతున్నాయి. ప్రీపోల్స్ అంచనాలు నిజమై..బైడెన్ అందలమెక్కుతారా..లేదా గతంలో జరిగినట్టే ప్రీపోల్స్ కాదని ట్రంప్ మరోసారి అధ్యక్ష పదవిని అధిరోహిస్తారా..
అమెరికా ఎన్నికలప్రపంచ దేశాల దృష్టి ఇప్పుడు పై పడింది. మరి కాస్సేపట్లో ప్రారంభం కానున్నాయి. కోవిడ్ సంక్రమణ ( Covid spread ) భయం నేపధ్యంలో అమెరికన్లు చాలావరకూ ముందస్తు ఓటింగ్ కు మొగ్గు చూపారు. మెయిల్ ఇన్ ఓటింగ్ ( Mail in voting ) , పోస్టల్ బ్యాలెట్ల ( Postal ballots ) ద్వారా రిజిస్టరైన మొత్తం 24 కోట్ల మంది రిజిస్టర్ ఓటర్లలో.. దాదాపు 10 కోట్ల మంది ఇప్పటికే ఓటు హక్కు వినియోగించుకున్నారు.
మరోవైపు ఇప్పటికే అమెరికా ఎన్నికల్లో దాదాపు సర్వేలన్నీ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధి జో బైడెన్ ( Democratic party candidate joe biden ) ముందంజలో ఉన్నట్టు వెల్లడించాయి. సీఎన్ఎన్ పోల్స్ ( CNN Polls ) ఫలితాల్లో బైడెన్.. ట్రంప్ తో పోలిస్తే...పది పాయింట్ల ఆధిక్యంలో ఉన్నట్టు చెబుతున్నాయి. సీఎన్ఎన్ పోల్స్ ప్రకారం బైడెన్ కు 52 శాతం అయితే..ట్రంప్ 42 శాతం పడే అవకాశముందని తెలుస్తోంది. ఇక న్యూయార్స్ టైమ్స్, ఫాక్స్ న్యూస్ సంస్థలు సైతం ట్రంప్ తో పోలిస్తే..బైడెన్ కే 8-10 పాయింట్లు అధికంగా రావచ్చని చెబుతున్నాయి.
అయితే 2016 అధ్యక్ష ఎన్నికల ( America president Elections ) పోల్స్ ఫలితాలతో పోలిస్తే ఈసారి బైడెన్‌కు మద్దతు కాస్తా ఎక్కువగా కన్పిస్తోంది. న్యూయార్క్స్ టైమ్స్ సంస్థ అంచనా నిజమైతే మాత్రం జో బైడెన్ భారీ మెజార్టీతో విజయం సాధిస్తారు. 2016 అధ్యక్ష ఎన్నికల్లో ఆగస్టు నెలలో ట్రంప్ కంటే అప్పటి డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్ 10 పాయింట్ల అధిక్యంలో ఉన్నారు. కానీ పోలింగ్ డే నవంబర్ 8 నాటికి నాలుగు పాయింట్లకు పడిపోయింది. ఆ సమయంలో హిల్లరీకు 46 శాతం, ట్రంప్‌కు 42 శాతంగా ఉంది. చివరికి స్వింగ్ రాష్ట్రాల్లో ట్రంప్ విజయం సాధించి అధ్యక్ష పీఠం దక్కించుకున్నారు.
గతంలో పోలింగ్ కంటే ఒకరోజు ముందు డమోక్రటిక్ పార్టీ అభ్యర్ధి ఆధిక్యత 4 పాయింట్లుండగా..ఈసారి అదే పార్టీ అభ్యర్ధి జో బైడెన్ ఆధిక్యత 10 పాయింట్లుగా ఉంది.
ప్రపంచాన్ని గజగజలాడించిన కరోనా వైరస్ మహమ్మారిని నియంత్రించడంలో ట్రంప్ ( Trump ) విఫలమయ్యారనేది అమెరికన్ల భావన. అందుకే ఈసారి ట్రంప్ కు వ్యతిరేక ఓట్లు నమోదయ్యే పరిస్థితి ఉంది. కరోనా వైరస్ ట్రంప్‌కు ప్రతికూలంగా మారనుంది. కరోనా సంక్షోభంపై ట్రంప్ స్పందించిన తీరును దాదాపు 57.2 శాతం మంది తప్పుబడుతున్నారు. కేవలం ట్రంప్ నిర్లక్ష్యం కారణంగానే అమెరికాలో 2 లక్షల 30 వేలమంది బలయ్యారని మండిపడుతున్నారు. ఇప్పటికే స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ ( Stanford university ) నివేదిక ఇదే విషయాన్ని స్పష్టం చేసింది.
డొనాల్డ్ ట్రంప్రీపోల్స్ అన్నీ జో బైడెన్ కే మద్దతు పలుకుతున్నా సరే..లోలోపల సంశయం మాత్రం ఉంది. దీనికి కారణం గతంలో జరగిన ఎన్నికలే. 2016 ఆగస్టు నెలలో హిల్లరీ.. ప్ ( Donald trump ) కంటే 10 పాయింట్లతో ముందంజలో ఉన్నారు. కానీ తరువాత పరిస్థితులు పూర్తిగా మారిపోయి ట్రంప్ ఒక్కసారిగా పుంజుకున్నారు.
అయితే గతంలో ఏ స్వింగ్ రాష్ట్రాల్లో సాధించిన ఆధిక్యంతో డోనాల్డ్ ట్రంప్ విజయం సాధించారో..అక్కడీసారి ట్రంప్ కు పూర్తిగా వ్యతిరేకపవనాలు వీస్తున్నాయి. పోటీ గట్టిగా ఉండే మిచిగాన్, విస్కాన్సిన్, అరిజోనా, నార్త్ కరోలినా రాష్ట్రాల్లో ట్రంప్ కంటే బైడెన్ పరిస్థితే మెరుగ్గా ఉందని సీఎన్ఎన్ తాజా ఫలితాల చెబుతున్నాయి.
అమెరికా ( America ) లో ఏం జరగబోతోంది.. ప్రీపోల్స్ ( All pre polls ) అన్నీ జో బైడెన్ కే మొగ్గుచూపుతున్నాయి. ప్రీపోల్స్ అంచనాలు నిజమై..బైడెన్ అందలమెక్కుతారా..లేదా గతంలో జరిగినట్టే ప్రీపోల్స్ కాదని ట్రంప్ మరోసారి అధ్యక్ష పదవిని అధిరోహిస్తారా..