Boat sank in the English Channel: యూరప్​లో ఘోర పడవ ప్రమాదం జరిగింది. ఫ్రాన్స్ నుంచి ఇంగ్లీష్​ ఛానెల్​ మీదుగా వెళ్తున్న ఓ ప్రయాణికుల బోటు నీట మునగింది. ఈ దర్ఘటనలో మొత్తం 31 మంది ప్రాణాలు (Boat sank English Channel) కోల్పోయారు. ప్రమాద సమయంలో పడవలో 34 మంది ఉన్నట్లు తెలిసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు సురక్షితంగా బయటపడగా.. మరో వ్యక్తి ఆచూకి ఇంకా తెలియరాలేదు. మృతులు ఏ దేశానికి చెందినవారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.


శరణార్థులుగా అనుమానం..


పడవలో ప్రయాణిస్తున్నవారంతా శరణార్థులుగా అనుమానిస్తున్నారు (Migrant boat capsizes) అధికారులు. వారంతా ఫ్రాన్స్​ నుంచి బ్రిటన్ ప్రయాణిస్తున్నట్లుగా గుర్తించారు.


పడవలో ఎక్కువ మంది అఫ్గానిస్థాన్​, సుడాన్​, ఇరాక్​, ఎరిత్రియా దేసాలకు చెందిన పౌరులు ఉన్నట్లు సమాచారం. పడవలో సామర్థ్యానికి మించి ప్రయాణికులు ఎక్కడం వల్లే.. అది మునిగిపోయు ఉంటుందని అధికారులు అంటున్నారు. ఈ ప్రమాదంపై ఇటు ఫ్రాన్స్, అటు బ్రిటన్ ప్రభుత్వాలు విచారం వ్యక్తం చేశాయి.


Also read: పెగసస్ స్పైవేర్ చుట్టూ మరో వివాదం, ఎన్ఎస్ఓ గ్రూప్‌పై యాపిల్ కేసు


వలసలు ఎందుకు?


అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న అఫ్గానిస్థాన్​ సహా నిత్యం సంక్షర్షణ భయాలున్న ఇరాక్​, సుడాన్ వంటి దేశాల పౌరులు.. మెరుగైన జీవనం, మంచి అవకాశాల కోసం.. ఇతర దేశాలను ఆశ్రయిస్తున్నారు. ఇందుకోసం ప్రాణాలను పణంగా పెట్టి ప్రమాదకరంగా ప్రయాణాలు సాగిస్తున్నారు.


ఇదిలా ఉండగా.. ఇంగ్లీష్ ఛానెల్ మీదుగా అక్రమ రాకపోకలను అడ్డుకునేందుకు ఫ్రాన్స్, బ్రిటన్​లు సంయుక్తంగా పని చేయాలని గతంలో నిర్ణయించుకున్నాయి. అయితే ఈ విషయంపై ఇరు దేశాలు సరైన నిఘా పెడ్డటంలో లేదంటూ ఆరోపణలు వస్తున్నాయి.


Also read: Imran Khan: 'దేశాన్ని నడిపించేంత డబ్బు ప్రభుత్వం వద్ద లేదు': ఇమ్రాన్ ఖాన్​


Also read: గడ్డకట్టిన మహా సముద్రం, ఇరుక్కుపోయిన 18 గూడ్స్ ఓడలు, ఎక్కడంటే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook