గడ్డకట్టిన మహా సముద్రం, ఇరుక్కుపోయిన 18 గూడ్స్ ఓడలు, ఎక్కడంటే

చలి ప్రభావం తీవ్రమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా సముద్రమార్గంలో జరిగే రవాణాపై ఆ ప్రభావం కన్పిస్తోంది రవాణా ఆగితే కోట్లాది రూపాయల నష్టం వాటిల్లే పరిస్థితి. రష్యా సమీపంలో సముద్రంలో దాదాపు 18 గూడ్స్ షిప్స్ మంచులో ఇరుక్కుపోయిన దృశ్యాలు ఇవి..

Ships Stucked in Frozen Sea: చలి ప్రభావం తీవ్రమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా సముద్రమార్గంలో జరిగే రవాణాపై ఆ ప్రభావం కన్పిస్తోంది రవాణా ఆగితే కోట్లాది రూపాయల నష్టం వాటిల్లే పరిస్థితి. రష్యా సమీపంలో సముద్రంలో దాదాపు 18 గూడ్స్ షిప్స్ మంచులో ఇరుక్కుపోయిన దృశ్యాలు ఇవి..

1 /5

సముద్రమార్గంలో సాధారణంగా తప్పు చేయడానికి ఆస్కారముండదు. ఇలా అసాధారణంగా నీరు గడ్డకట్టడంతో కోట్లాది రూపాయల నష్టం వాటిల్లుతుంది. తక్షణం సాధారణ పరిస్థితుల్ని నెలకొల్పకపోతే నెలరోజుల వరకూ ఇలాగే ఉండిపోవల్సి వస్తుంది. 

2 /5

వాస్తవానికి సముద్రం గడ్డకట్టడమనేది సాధారణ విషయమే. ఈసారి మాత్రం కాస్త ముందుగా జరిగింది. 

3 /5

కొన్ని ఓడలైతే చాలా రోజుల్నించి ఇరుక్కుపోయాయని తెలుస్తోంది. దాంతో ఆహార పదార్ధాలు, మందుల్ని సరఫరా చేశారు. సముద్రంలో పేరుకుపోయిన మంచును తొలగించేందుకు రెండు ప్రత్యేకమైన ఐస్ బ్రేకర్స్‌ను పంపించింది రష్యా. దాంతోపాటు రెండు ఆయిర్ ట్యాంకర్లు, కార్గో బోట్స్‌లను పంపింది. 

4 /5

మాస్కో టైమ్స్‌లో ప్రచురితమైన నివేదిక ప్రకారం, చాలావరకూ ఓడలు లాప్టేవ్ సముద్రం, తూర్పు సైబీరియా సముద్రంలో 30 సెంటీమీర్ల మేర ఏర్పడిన మంచు కారణంగా ఇరుక్కుపోయాయి. 

5 /5

రష్యా తీరప్రాంతం సమీపంలో ఆర్కిటిక్ సముద్రం నిర్ణీత కాలం కంటే ముందే గడ్డ కట్టుకుపోతోంది. ఫలితంగా దాదాపు 18 గూడ్స్ ఓడలు ఇరుక్కుపోయాయి.