Monkeypox: ప్రపంచవ్యాప్తంగా మంకీ పాక్స్ టెర్రర్..భారత్‌లోనూ తాజాగా కేసు నమోదు..!
Monkeypox: ఓ పక్క కరోనా..మరో పక్క మంకీ పాక్స్‌తో ప్రపంచ దేశాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటం తీవ్ర ఆందోళన కల్గిస్తోంది. అమెరికా సహా అనేక దేశాలను మంకీపాక్స్ వణికిస్తోంది.
Monkeypox: ఓ పక్క కరోనా..మరో పక్క మంకీ పాక్స్‌తో ప్రపంచ దేశాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటం తీవ్ర ఆందోళన కల్గిస్తోంది. అమెరికా సహా అనేక దేశాలను మంకీపాక్స్ వణికిస్తోంది. తాజాగా భారత్‌లోనూ మంకీ పాక్స్ కేసులు వెలుగు చూస్తున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ 5 ఏళ్ల చిన్నారికి వ్యాధి లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో అక్కడ ఒక్కసారిగా కలకలం రేగింది. చిన్నారి శరీరంపై దద్దుర్లు, బొబ్బలు రావడాన్ని తల్లిదండ్రులు గుర్తించారు.
వెంటనే చిన్నారిని సమీప ఆస్పత్రికి తరలించారు. చిన్నారికి మంకీపాక్స్ సోకినట్లు ప్రాథమికంగా గుర్తించారు. నమూనాలను టెస్ట్ కోసం అధికారులు సేకరించారు. ఇది కేవలం ముందు జాగ్రత్త చర్యే అని ..ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంటున్నారు. బాధిత చిన్నారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని తల్లిదండ్రులు, వైద్యులు చెబుతున్నారు. చిన్నారి కుటుంబసభ్యుల్లో విదేశాలకు వెళ్లి వచ్చిన వారు ఎవరూ లేరని గుర్తించారు.
ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 20కిపైగా దేశాలకు మంకీపాక్స్ వైరస్ విస్తరించింది. ఇప్పటివరకు 700లకు పైగా కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ఈవిషయాన్ని యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ డేటా చెబుతోంది. అమెరికాలో మంకీపాక్స్ తీవ్ర స్థాయిలో ఉంది. అక్కడ 11 రాష్ట్రాల్లో 21 కేసులు వెలుగు చూశాయి. కెనడాలోనూ 77 కేసులు బయటపడ్డాయి. మంకీపాక్స్ వైరల్ వ్యాధి అని నిపుణులు చెబుతున్నారు.
మంకీ పాక్స్ ..స్మాల్ పాక్స్ కుటుంబానికే చెందినది అంటున్నారు. ఇది జంతువుల నుంచి మనుషులకు సోకుతుందని..సాధారణంగా మధ్య పశ్చిమ ఆఫ్రికాల్లో మంకీ పాక్స్ అధికంగా ఉంటుందని చెబుతున్నారు. మంకీ పాక్స్..శరీరంలోకి పూర్తిగా వ్యాప్తి చెందడానికి సాధారణంగా 6 నుంచి 12 రోజులు పడుతుందని..ఒక్కోసారి 5 నుంచి 21 రోజుల సమయం పడుతుందని విశ్లేషిస్తున్నారు. ఈవైరస్‌ను 1958లో మొదటిసారి కోతుల్లో గుర్తించినట్లు చెబుతున్నారు. అందుకే ఈవైరస్ మంకీ పాక్స్ వచ్చిందంటున్నారు.
Also read: Sharmila Comments: తెలంగాణలో మహిళలకు రక్షణ లేదు..టీఆర్ఎస్ సర్కార్‌పై షర్మిల ఫైర్..!
Also read:Rahul Gandhi Twit: లోక్ కళ్యాణ్ మార్గ్‌తో ప్రజలకు సంక్షేమం దక్కదు..మోదీపై రాహుల్ సెటైర్లు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook