ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మృత్యు ఘంటికలు మోగుతున్నాయి. ప్రతిరోజూ వేలాది మందిని ప్రాణాంతక మహమ్మారి పొట్టపెట్టుకుంటోంది. ఈ క్రమంలో కరోనా బారిన పడి చనిపోయిన వారి సంఖ్య 2 లక్షలు దాటిపోయింది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 29లక్షలు దాటి 30 లక్షల కేసుల వైపు పరుగులు పెడుతోంది. కరోనా కేసుల్లో మూడో వంతు, మరణాలలో నాలుగో వంతు అగ్రరాజ్యం అమెరికా దేశంలోనే సంభవించినట్లు జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ పేర్కొంది. గరిష్ట ధరలకు బంగారం.. వెండి పరుగులు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా వైరస్ కేసులు ప్రపంచ వ్యాప్తంగా  శనివారం రాత్రి వరకు 2,896,633 నమోదయ్యాయి. చికిత్స అనంతరం కోలుకుని దాదాపు 8,34,500 మంది కోలుకున్నారు. రెండు లక్షల మంది ప్రాణాలు కోల్పోగా, ప్రస్తుతం 18.8 లక్షల మంది కోవిడ్19 చికిత్స తీసుకుంటున్నారు. శనివారం ఒక్కరోజే అమెరికాలో 33,911 కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 9,38,140కి చేరుకుంది. హీరోయిన్ హాట్ ఫొటోలతో ‘హార్ట్ ఎటాక్’!


అధికారిక లెక్కల ప్రకారం శనివారం నాటికి కరోనా తీవ్రత ఉన్న దేశాలలో.. అమెరికాలో 9,38,072 కేసులు - 53,751 మరణాలు, స్పెయిన్ 2,23,759 కేసులు - 22,902 మరణాలు, ఇటలీ 1,95, 351 కేసులు - 26,384 మరణాలు, ఫ్రాన్స్ 161,644 కేసులు - 22,614 మరణాలు, జర్మనీ 1,56,513 కేసులు - 5,877 మరణాలు, బ్రిటన్ 1,49,569 కేసులు - 20,319 మరణాలు, టర్కీ 1,7,773 కేసులు - 2,706 మరణాలు చోటుచేసుకున్నాయి.  బ్రేక్‌ఫాస్ట్ ఎక్కువగా తింటే ఎన్ని లాభాలో!


చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. చైనా మాత్రం కరోనాను జయించామంటూ ఏ చర్యలు తీసుకున్నారో వివరాలపై దాటవేస్తోంది. రెండు వారాల కిందటే చైనాలో అన్ని రకాల మార్కెట్లు తిరిగి ప్రారంభమయ్యాయి.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 


Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!


 ‘అల వైకుంఠపురములో’ భామ Hot Photos