Height of Mount Everest: న్యూ ఢిల్లీ: ఎవ‌రెస్ట్ పర్వత శిఖ‌రం ఎత్తు విషయంలో ఇప్పటివరకు చెప్పుకుంది ఒక ఎత్తు అయితే... ఇకపై చెప్పుకోబోయే ఎత్తు నిజంగానే మరో ఎత్తు. ఎందుకంటే మౌంట్ ఎవరెస్ట్ ఎత్తు ఇప్పటివరకు మనం చెప్పుకుంటున్నదానికంటే మరో 2.8 మీటర్ల ఎక్కువేనని తాజాగా జరిపిన పరిశోధనల్లో తేలింది. నేపాల్, చైనా సరిహద్దుల్లో ఉన్న మౌంట ఎవరెస్ట్ ఎత్తుపై ఆ రెండు దేశాలకు చెందిన ప్రభుత్వాలు సంయుక్తంగా ఓ సర్వే చేపట్టాయి. ఈ సర్వేలో తేలింది ఏంటంటే.. మౌంట్ ఎవ‌రెస్ట్ 8848.86 మీట‌ర్లు ( 29,031.69 అడుగులు ) ఉన్న‌ట్లు గుర్తించారు. గతంలో చెప్పుకుంటున్న దానికన్నా ఇది 2.8 మీటర్ల ఎత్తు ఎక్కువ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎవరెస్ట్ ప‌ర్వ‌తం ఎత్తు విషయంలో ఇప్పటివరకు చైనా, నేపాల్ మధ్య భిన్నాభిప్రాయాలు ఉండగా.. తాజాగా చేపట్టిన సర్వే తర్వాత ఆ రెండు దేశాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. ఈ మేరకు నేపాల్ విదేశాంగ శాఖ మంత్రి ప్ర‌దీప్ గ‌యావాలీ మంగళవారం ఖాట్మండులో ఓ ప్రకటన చేశారు. ఈ వ‌ర్చువ‌ల్ మీట్‌లో చైనా మంత్రి వాంగ్ యూ కూడా పాల్గొన్నారు. డిసెంబ‌ర్ 11ను అంత‌ర్జాతీయ మౌంటేన్ డేగా ( International mountain day ) జరపనున్న నేప‌థ్యంలో అంతకంటే మూడు రోజుల ముందే నేపాల్, చైనా ప్రభుత్వాలు మౌంట్ ఎవరెస్ట్ ఎత్తుపై ఈ ప్ర‌క‌ట‌న చేసినట్టు తెలుస్తోంది.


Also read : Mount Everest Height: ఎవరెస్టు శిఖరం ఎత్తు మారింది..త్వరలో అధికారిక ప్రకటన


నేపాల్‌లో 2015లో సంభవించిన భూకంపం ( Nepal earthquake ) వ‌ల్ల ఎవ‌రెస్ట్ శిఖ‌రం ఎత్తులో మార్పులు చోటుచేసుకుని ఉంటాయనే అనుమానాల నేపథ్యంలో నేపాల్ ప్ర‌భుత్వం, చైనాతో కలిసి మౌంట్ ఎవ‌రెస్ట్ ఎత్తును ( Mount Everest height ) కొలిచింది. 1954లో అప్పటి భారత ప్రభుత్వం నేతృత్వంలో సర్వే ఆఫ్ ఇండియా విభాగం మౌంట్ ఎవరెస్ట్ ఎత్తుపై ఓ సర్వే చేసింది. ఈ సర్వేలో ఎవరెస్ట్ పర్వతం ఎత్తు 8,848 మీటర్లు (29,028 అడుగులు ) ఉన్నట్టు తేలింది.


Also read : Brucellosis: చైనాలో విస్తరిస్తూ..భయపెడుతున్న మరో వ్యాధి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


సోషల్ మీడియాలో జీ హిందుస్థాన్ పేజీలను సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook