Mount Everest: వేగంగా కరిగిపోతున్న హిమానీనదం..ప్రమాదంలో ఎవరెస్ట్ శిఖరం..!
Mount Everest: ఎవరెస్టు శిఖరాగ్రానికి దగ్గరల్లో ఉన్న ఒక హిమానీనదం వేగంగా కరిగిపోతోంది. వాతావరణ మార్పుల కారణంగా గత పాతికేళ్లలో ఇది బాగా తగ్గిపోయింది.
Mount Everest: ప్రపంచంలోని ఎత్తైన ఎవరెస్ట్ శిఖరానికి (Mount Everest) సమీపంలోని ఓ హిమానీనదం కరిగిపోతుంది. ఈ గ్లేసియర్ ఏర్పడటానికి వేల సంవత్సరాలు పట్టింది. వాతావరణ మార్పుల కారణంగా.. గత మూడు దశాబ్దాలలో గణనీయంగా తగ్గిపోయిందని తాజా అధ్యయనంలో వెల్లడైంది.
గత 25 సంవత్సరాలలో సౌత్ కోల్ హిమానీనదం (South Col Glacier) దాదాపు 55 మీటర్ల (180 అడుగులు) మేర మందాన్ని కోల్పోయిందని...మైనే విశ్వవిద్యాలయం (Main University) నేతృత్వంలోని పరిశోధన బృందం వెల్లడించింది. ఈ మంచు పైపొరను ‘కార్బన్ డేటింగ్’ విధానంతో విశ్లేషించినప్పుడు అది రెండు వేల సంవత్సరాల కిందట ఏర్పడినట్లు తేలిందని శాస్త్రవేత్తలు తెలిపారు. అది ఏర్పడటానికి పట్టిన సమయంతో పోలిస్తే 80 రెట్లు వేగంగా కరిగిపోతోందని పేర్కొన్నారు. ఈ లెక్కన చూస్తే అది కొన్ని దశాబ్దాల్లోనే అంతర్థానమయ్యే అవకాశం ఉందని ప్రధాన శాస్త్రవేత్త పాల్ మేయెవ్స్కీ నేషనల్ జియోగ్రాఫిక్‌తో చెప్పారు.
సౌత్ కోల్ హిమానీనదం సముద్ర మట్టానికి 7,900 మీటర్లు (26,000 అడుగులు) ఎత్తులో ఉంది. ప్రపంచంలోని ఎత్తైన పర్వత శిఖరానికి ఒక కిలోమీటరు దిగువన ఉంది. 1994 నుంచి రికార్డు స్థాయిలో 25 సార్లు ఎవరెస్టు పర్వతాన్ని అధిరోహించిన నేపాలీ పర్వతారోహకుడు కామి రీటా షెర్పా పర్వతంపై మార్పులను ప్రత్యక్షంగా చూసినట్లు ఓ వార్తా సంస్థకు చెప్పారు. హిమాలయాల్లోని హిమానీనదాలు దాదాపు రెండు బిలియన్ల ప్రజలకు కీలకమైన నీటి వనరు. ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన 10 నదీ వ్యవస్థలకు ఇవే ఆధారం.
Also Read: Mahatma Gandhi Statue Vandalized: మహాత్మా గాంధీ కాంస్య విగ్రహం ధ్వంసం.. మహాత్ముడికే అవమానమా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి