Mahatma Gandhi Statue Vandalized: మహాత్మా గాంధీ కాంస్య విగ్రహం ధ్వంసం.. మహాత్ముడికే అవమానమా!

Mahatma Gandhi statue: అమెరికాలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.  ఈ చర్యను భారత కాన్సులేట్ జనరల్ తీవ్రంగా ఖండించారు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 6, 2022, 09:43 AM IST
  • గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు
  • తీవ్రంగా ఖండించిన భారతీయులు
  • బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
Mahatma Gandhi Statue Vandalized: మహాత్మా గాంధీ కాంస్య విగ్రహం ధ్వంసం.. మహాత్ముడికే అవమానమా!

Mahatma Gandhi statue: అమెరికాలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని (Mahatma Gandhi Statue) కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.  న్యూయార్క్‌ నగరంలోని (New York City) మాన్‌హాటన్ యూనియన్ స్క్వేర్‌లోని 8 అడుగుల గాంధీ కాంస్య విగ్రహాన్ని శనివారం దుండగులు ధ్వంసం చేశారు. ఈ చర్యను భారత కాన్సులేట్ జనరల్ (Consulate General of India) తీవ్రంగా ఖండించారు. బాధ్యులపై తగిన చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

మహాత్మా గాంధీ 117వ జయంతి (Gandhi 117th birth anniversary) సందర్భంగా ఈ విగ్రహాన్ని న్యూయార్క్‌లో 1986, అక్టోబర్‌2న ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని  గాంధీ మెమోరియల్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ విరాళంగా ఇచ్చింది, అయితే 2001లో కొన్ని కారణాలతో ఈ విగ్రహాన్ని తొలగించగా మళ్లీ 2002లో పునరుర్ధరించారు. గాంధీ విగ్రహంపై దాడిని ఇక్కడ భారతీయ-అమెరికన్లు ఖండించారు. 

అమెరికాలో గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేయడం ఇదే తొలిసారి కాదు. గత ఏడాది జనవరిలో కాలిఫోర్నియాలోని ఓ పార్కులో ఉన్న విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. డిసెంబర్ 2020లో జరిగిన మరో సంఘటనలో.. ఖలిస్తానీ-మద్దతుదారులు వాషింగ్టన్ డీసీలోని భారత రాయబార కార్యాలయం ముందు గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఆ చర్యను అప్పటి వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కైలీ మెక్‌నానీ 'భయంకరమైనది'గా అభివర్ణించారు.

Also read: US Covid-19: అమెరికాలో కరోనా మరణ మృదంగం..9 లక్షలు దాటిన మరణాలు..!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link https://apple.co/3loQYe 

Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News