Nepal Helicopter Crash: నేపాల్‌లో కుప్పకూలిన హెలికాప్టర్.. ఆరుగురు దుర్మరణం
Missing Helicopter Crashes in Nepal: నేపాల్‌లో తప్పిపోయిన హెలికాఫ్టర్ ఎవరెస్ట్ పర్వతం సమీపంలో కుప్పకూలింది. ఈ ఘటనలో ఐదగురు మెక్సికన్ పర్యాటకులతోపాటు ఆరుగురు మరణించారు. హెలికాఫ్టర్ టేకాఫ్ అయిన 15 నిమిషాలకే సంబంధాలు తెగిపోయాయి.
Missing Helicopter Crashes in Nepal: నేపాల్‌లో అదృశ్యమైన హెలికాఫ్టర్ ప్రమాదానికి గురైంది. ఎవరెస్టు శిఖరం సమీపంలో హెలికాఫ్టర్ కుప్పకూలగా.. ఆరుగురు దుర్మరణం చెందారు. సోలుకుంభు నుంచి ఖట్మాండ్‌కు ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతుల్లో ఐదుగురు మెక్సికన్ పర్యాటకులు ఉన్నారు. ఆరుగురి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కూలిపోయిన హెలికాప్టర్ శిథిలాలను నేపాల్ సెర్చ్ గుర్తించింది.
హెలికాప్టర్ కూలిపోయిన సమచారం గ్రామస్థులు నేపాల్ శోధన బృందానికి సమాచారం అందించారని కోషి ప్రాంట్ పోలీస్ డీఐజీ రాజేష్‌నాథ్ బస్టోలా వెల్లడించారు. మనాంగ్ ఎయిర్‌కు చెందిన ఈ హెలికాప్టర్ మంగళవారం ఉదయం 10.10 నిమిషాలకు బయలుదేరగా..15 నిమిషాల తర్వాత హెలికాప్టర్‌కు సంబంధాలు తెగిపోయాయని తెలిపారు. సీనియర్ పైలట్ చెట్ గురుంగ్ నడుపుతుండగా.. ఆయనతోపా ఐదుగురు విదేశీయులు కూడా ప్రయాణిస్తున్నారు. సోలుఖుంబు జిల్లాలోని లిఖుపికే గ్రామీణ మున్సిపాలిటీలోని లమ్‌జురా వద్ద కూలిపోయిందన్నారు.
పర్వతంపై ఉన్న చెట్టును హెలికాప్టర్ ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. స్వాధీనం చేసుకున్న మృతదేహాలను ఇంకా గుర్తించలేదని రాజేష్‌నాథ్ బస్టోలా తెలిపారు. హెలికాప్టర్‌లో కెప్టెన్ చెట్ బహదూర్ గురుంగ్‌తో పాటు ఐదుగురు మెక్సికన్ పర్యాటకులు మరణించారని మనాంగ్ ఎయిర్ ఆపరేషన్స్ అండ్ సెక్యూరిటీ మేనేజర్ రాజు న్యూపెన్ వెల్లడించారు. ప్రమాదం చోటు చేసుకొన్న ప్రదేశం ఎవరెస్ట్ శిఖరానికి సమీపంలో ఉంటుందన్నారు. ప్రమాదానికి గురైన హెలికాప్టర్లో అమర్చిన జీపీఎస్ సంకేతాలు లమ్జురాపాస్ వద్ద నిలిచిపోయినట్లు పేర్కొన్నారు.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని వీక్షించేందుకు ఐదుగురు మెక్సిన్ పర్యాటకులను తీసుకువెళుతుండగా.. హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ఎత్తైన పర్వతాల కారణంగా నేపాల్‌లో విమాన ప్రమాద తరుచూ చోటు చేసుకుంటున్నాయి. ఈ ఏడాది జనవరిలో ఖట్మాండ్ నుంచి కాస్కీ జిల్లాలోని పొఖారాకు వెళ్తున్న ఓ విమానం చెందిన విమానం కుప్పకూలి.. 72 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తాజాగా మరో ఆరుగురు మరణించడం విషాదాన్ని నింపుతోంది.
Also Read: David Warner: డేవిడ్ వార్నర్ భార్య ఎమోషనల్ పోస్ట్.. చివరి మ్యాచ్ ఆడేశాడా..?
Also Read: Old City Metro Project: ఓల్డ్ సిటీ మెట్రోకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్.. మంత్రి కేటీఆర్ ట్వీట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి