India Bans UK Flights: యూకే నుంచి వచ్చే విమానాలపై నిషేధం
కరోనావైరస్ (CoronaVirus) మహమ్మారిని అరికట్టేందుకు ఏడాది నుంచి శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు కంటిమీద కునుకులేకుండా పోరాడుతుంటే.. ప్రస్తుతం మరో కొత్త రకం వైరస్ అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది.
India Bans UK Flights: కరోనావైరస్ (CoronaVirus) మహమ్మారిని అరికట్టేందుకు ఏడాది నుంచి శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు కంటిమీద కునుకులేకుండా పోరాడుతుంటే.. ప్రస్తుతం మరో కొత్త రకం వైరస్ అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. బ్రిటన్ సహా ఆఫ్రికా దేశాల్లో కొత్త రకం కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తోంది. దీంతో (New COVID-19 strain) దాని వ్యాప్తిని అరికట్టేందుకు పలు దేశాలు ఇప్పటికే విమానాల రాకపోకలపై నిషేధం విధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం (India) కూడా కీలక నిర్ణయం తీసుకుంది.
యూకే (UK) నుంచి వచ్చే విమానాలపై భారత ప్రభుత్వం (central government) తాత్కాలికంగా నిషేధం విధించింది. ఈ నెల 22వ తేదీ రాత్రి 11.59 గంటల నుంచి డిసెంబర్ 31 రాత్రి 11.59 గంటల వరకు యూకే నుంచి వచ్చే విమానాలపై తాత్కాలికంగా (India suspends all flights originating from UK ) నిషేధం విధిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. ఈ సమయంలో బ్రిటన్ నుంచి వచ్చే విమానాలకు అనుమతి లేదని కేంద్ర విమానయాన శాఖ (Ministry of Civil Aviation) వెల్లడించింది. ఇప్పటికే ఫ్రాన్స్, జర్మనీ, బెల్జియం, కెనడా, ఇటలీ, ఆస్ట్రియా, నెదర్లాండ్, బెల్జియం వంటి దేశాలు యూకే నుంచి వచ్చే విమానాలను నిషేధించాయి. Also Read: Ban On UK Flights: యూకేలో కొత్త వైరస్ కలకలం.. ఫ్లైట్ బ్యాన్ చేస్తున్న పలు దేశాలు
ప్రస్తుతం యూకే నుంచి వస్తున్న విమానాల్లో ఉన్న ప్రయాణికులు ముందు జాగ్రత్త చర్యగా ఆర్టీ-పీసీఆర్ (RTPCR) టెస్ట్‌ను తప్పనిసరిగా చేయించుకోవాలని విమానయాన శాఖ వెల్లడించింది. ఇప్పటికే యూకే నుంచి బయలుదేరిన విమానాలు లేదా డిసెంబర్ 22, రాత్రి 11.59 గంటలలోపు వచ్చే విమానాల్లో వస్తున్న ప్రయాణికులు ఈ టెస్ట్‌ను చేయించుకోవాలని సూచించింది.
Also Read: Health tips: శీతాకాలంలో డయాబెటిస్ పేషెంట్స్ ఇవి తింటే రిస్కే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook