Newzealand PM Jacinda Ardern Wedding cancelled: కరోనా కారణంగా న్యూజిలాండ్ ప్రధాని జసిండా ఆర్డెర్న్ వివాహం రద్దయింది. దేశంలో కరోనా ఆంక్షల నేపథ్యంలో తన వివాహాన్ని తాత్కాలికంగా రద్దు చేసుకుంటున్నట్లు ప్రధాని జసిండా ప్రకటించారు. తనలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నవారి పట్ల విచారం వ్యక్తం చేశారు. న్యూజిలాండ్‌లో ఒమిక్రాన్ వేరియంట్ కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ నేపథ్యంలో ఆదివారం (జనవరి 23) అర్ధరాత్రి నుంచి ఆంక్షలు అమలులోకి రానున్నాయి. దీంతో జసిండా తన వివాహాన్ని రద్దు చేసుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పెళ్లి రద్దు నిర్ణయంపై ఎలా ఫీల్ అవుతున్నారనే మీడియా ప్రశ్నకు.. 'జీవితమంటే అదే..' అని జసిండా (Jacinda Ardern) బదులివ్వడం గమనార్హం. జసిండా కొన్నేళ్లుగా క్లార్క్ గేఫోర్డ్‌తో సహజీవనం చేస్తున్నారు. త్వరలోనే పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఇంతలోనే ఒమిక్రాన్ కేసులు పెరగడంతో పెళ్లిని రద్దు చేసుకోక తప్పలేదు. 


ఇటీవలే న్యూజిలాండ్‌లో ఒమిక్రాన్ కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌ను (Omicron Cases) గుర్తించారు. నీల్సన్ ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం ఆక్లాండ్‌లో ఓ వివాహ వేడుకకు హాజరు కాగా.. ఫ్లైట్ అటెండెంట్ సహా ఆ కుటుంబంలో 9 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. జీనోమ్ స్వీకెన్సింగ్ ద్వారా వారికి ఒమిక్రాన్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో నార్త్ నుంచి సౌత్‌కి ఒమిక్రాన్ వ్యాప్తి చెందినట్లయింది. వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం ఒమిక్రాన్ కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌ను కట్టడి చేసేందుకు చర్యలు చేపట్టింది.


ఒమిక్రాన్ కట్టడి చర్యల్లో భాగంగా ఆదివారం అర్ధరాత్రి నుంచి న్యూజిలాండ్‌లో 'రెడ్ సెట్టింగ్' ఆంక్షలు (Covid 19 Restrictions) అమల్లోకి రానున్నాయి. ప్రతీ ఒక్కరు తప్పనిసరిగా ముఖానికి మాస్కు ధరించడం, వివాహాలు, బార్ అండ్ రెస్టారెంట్లు, ఇతరత్రా కార్యక్రమాల్లో 100 మందికి మించకూడదనే నిబంధనలను కఠినంగా అమలుచేయనున్నారు. ఒకవేళ వ్యాక్సిన్ పాసులు లేకపోతే 25 మందికి మించి అనుమతించరు. గతంలో డెల్టా వేరియంట్ కట్టడికి చేపట్టిన చర్యల మాదిరే ఈసారి కూడా ట్రేసింగ్, టెస్టింగ్, ఐసోలేషన్‌ను వేగవంతం చేస్తామని ప్రధాని జసిండా అర్డెర్న్ వెల్లడించారు.


Also Read: టీమిండియా ఇక దాన్ని అలవాటు చేసుకోవాలంటూ.. సంచలన వ్యాఖ్యలు చేసిన షోయబ్ అక్తర్!!


Also read: Covid 19 Update: దేశంలో వరుసగా రెండో రోజు స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook