Night Curfew: ఏపీలో సంక్రాంతి సందర్భంగా వాయిదా పడిన నైట్ కర్ఫ్యూ ఇవాళ్టి నుంచి అమలు కానుంది. కరోనా సంక్రమణను నియంత్రించేందుకు రాష్ట్రమంతా కఠినమైన ఆంక్షలు అమలు కానున్నాయి. ఆ వివరాలు ఇలా..
కరోనా థర్డ్‌వేవ్ నేపధ్యంలో రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ విధించారు. వాస్తవానికి జనవరి 13 నుంచి అమలు కావల్సి ఉన్నా..సంక్రాంతి పండుగను దృష్టిలో ఉంచుకుని ఇవాళ్టికి వాయిదా వేసింది ప్రభుత్వం. ఇవాళ్టి నుంచి రాష్ట్రంలో రాత్రి 11 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకూ నైట్ కర్ఫ్యూ అమల్లో ఉండనుంది. నైట్ కర్ప్యూ (Night Curfew) నిబంధనల నుంచి ఆసుపత్రులు, మెడికల్ ల్యాబ్స్, ఫార్మసీ రంగం, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బంది, ఇంటర్నెట్ , ఐటీ సంబంధిత సేవలు, పెట్రోల్ బంకులు, విద్యుత్, నీటి సరఫరా, పారిశుద్ధ్య సిబ్బందికి మినహాయింపు ఉంటుంది. అదే విధంగా న్యాయాధికారులు, కోర్టు సిబ్బంది, స్థానిక సంస్థల సిబ్బంది గుర్తింపు కార్డు చూపించి మినహాయింపు తీసుకోవచ్చు.
మాస్క్ ధారణ తప్పనిసరి చేసింది ప్రభుత్వం ( Ap Government). మాస్క్ ధరించకపోతే జరిమానా ఉంటుంది. ఇక పెళ్లిళ్లు, శుభకార్యాలు వంటివాటికి గరిష్టంగా 2 వందలమంది, ఇన్‌డోర్ అయితే 100 మందికి మాత్రమే అనుమతి ఉంటుంది. అందరూ కోవిడ్ నిబంధనల్ని కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. సినిమా హాళ్లు, రెస్టారెంట్లలో భౌతిక దూరం పాటించాలి. వ్యాపార, వాణిజ్య సంస్థల యాజమాన్యాలు మాస్కులు ధరించేలా చర్యలు తీసుకోవాలి. లేకపోతే పదివేల నుంచి 25 వేల వరకూ జరిమానా విధిస్తారు. అటు మార్కెట్లు, షాపింగ్ మాల్స్, దేవాలయాలు, ప్రార్ధనాలయాలు, మతపరమైన ప్రాంతాల్లో అందరూ కచ్చితంగా కోవిడ్ నిబంధనల్ని పాటించాల్సి ఉంటుంది. గర్భిణీలు, రోగులు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్ల ప్రయాణీకులు తగిన ఆధారాలు, టికెట్ చూపించాల్సి ఉంటుంది.
Also read: Four killed on spot : చెరువులోకి దూసుకెళ్లిన కారు.. స్పాట్‌లోనే నలుగురి మృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి