Afghanistan blast: ఆఫ్ఘనిస్థాన్‌లో భారీ పేలుడు (explosion in Afghanistan) సంభవించింది. సోమవారం జరిగిన ఈ ప్రమాదంలో తొమ్మిది మంది చిన్నారులు మృతి చెందగా... నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పాక్-అప్గాన్ సరిహద్దుల్లో ఈ పేలుడు చోటుచేసుకుంది. ఈ విషయాన్ని తాలిబన్ ప్రభుత్వం కూడా ధృవీకరించింది. తూర్పు నాగర్‌హర్ ప్రావిన్స్‌లోని  (Nagarhar province) లాలోపర్ జిల్లాలో ( Lalopar District) ఆహార పదార్థాలతో వెళ్తున్న వాహనంలో పేలుడు సంభవించిందని తాలిబాన్ గవర్నర్ కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాలిబాన్ ప్రత్యర్థి ఆయన ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ (Islamic State group) ప్రధాన కార్యాలయంఈ ప్రావిన్స్ లోనే ఉంది. ఆఫ్గాన్ ను తాలిబన్లు ఆక్రమించుకున్నప్పటి నుంచి.. ఆ దేశ పాలకులే లక్ష్యంగా ఐసిస్ దాడులకు పాల్పడుతుంది.  ఈ సంస్థ 2014 నుంచి ఈ ప్రాంతంలో తీవ్రవాద చర్యలకు పాల్పడుతోంది. వీరు చాలా వరకు షియా ముస్లింలను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడతారు. గత నెలలో కూడా నంగర్‌హార్ ప్రావిన్స్‌లోని ఒక పట్టణంలో పేలుడు సంభవించి నలుగురు మహిళలు సహా ఏడుగురు మరణించారు. అత్యధికంగా పేలని ల్యాండ్ మైన్స్, ఇతర ఆయుధాలు ఉన్న దేశాలలో ఆప్ఘాన్ ఒకటి. 


Also Read: Kazakhstan protests: కజకిస్తాన్ ఆందోళనల్లో 164 మంది మృతి!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook