Omicron Risk: ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ పై మరో ఆందోళన కల్గించే అంశం వెలుగుచూసింది. ఒమిక్రాన్ తో ముప్పు ఎక్కువేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organisation) హెచ్చరిక ఆందోళన కల్గిస్తోంది. డెల్టా వేరియంట్ (Delta Variant) తో పోలిస్తే సంక్రమణ చాలా వేగంగా ఉండటం కలవరం కల్గిస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దక్షిణాఫ్రికాలో (South Africa) వెలుగుచూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron) గజగజలాడిస్తోంది. అటు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తాజా హెచ్చరిక కలకలం రేపుతోంది. ఒమిక్రాన్ తో ఓవరాల్ ముప్పు చాలా ఎక్కువని డబ్ల్యూహెచ్ వో హెచ్చరించింది. ఒమిక్రాన్ వేరియంట్ డబ్లింగ్ రేటు డెల్టా వేరియంట్ తో పోలిస్తే చాలా ఎక్కువగా ఉందని...కేవలం 2-3 రోజుల్లోనే కేసులు రెట్టింపవుతున్నాయని తెలిపింది. వివిధ దేశాల్లో ముఖ్యంగా అమెరికా (America), యూకేలలో (UK) కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోందని.. డెల్టా వేరియంట్ కంటే ప్రమాదకరంగా మారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. 


యూకే, దక్షిణాఫ్రికా, డెన్మార్క్ దేశాల్నించి సేకరించిన డేటా ప్రకారం ఒమిక్రాన్ వేరియంట్ (Omicron Variant) కారణంగా ఆసుపత్రిలో చేరే పరిస్థితి చాలా తక్కువగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ గతంలో అభిప్రాయపడింది. అయితే ఇప్పుడు ఆ పరిస్థితిని విశ్లేషించేందుకు మరింత డేటా అవసరమని చెబుతోంది. ఆక్సిజన్ ఆవశ్యకత, వెంటిలేషన్, మరణాల రేటు, వేరియంట్ తీవ్రతను మరోసారి అంచనా వేయాలని తెలిపింది. మోనోక్లోనల్ యాంటీబాడీలు ఓమిక్రాన్ వేరియంట్ పై పెద్దగా ప్రభావం చూపించడం లేదని..కార్టికో స్టెరాయిడ్స్ ప్రభావం బాగానే ఉందని కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ వైద్య నిపుణులు తెలిపారు. 


డిసెంబర్ 20-26 మధ్య వారం రోజుల వ్యవధిలో కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరిగాయని..అక్టోబర్ నెలతో పోలిస్తే 11 శాతం పెరుగుదల నమోదైందని తెలిసింది. కేసులు అత్యధికంగా పెరిగింది మాత్రం గత వారంలోనేనని అమెరికా చెబుతోంది. తూర్పు మద్య దేశాలు, పశ్చిమ పసిఫిక్ ప్రాంతాల్లో కేసుల సంఖ్య గతం వారంతో పోలిస్తే సమానంగా ఉంది. అటు ఆఫ్రికన్ ప్రాంతంలో మాత్రం మరణాల సంఖ్య భారీగా పెరిగింది. ఈ ప్రాంతంలో ఏకంగా 72 శాతం మరణాలు సంభవించాయి. అటు దక్షిణ తూర్పు ఆసియాలో 9 శాతం మరణాలుంటే..అమెరికా ప్రాంతంలో 7 శాతం మరణాలున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 278 మిలియన్ల కోవిడ్ కేసులుంటే..5.4 మిలియన్ల మంది మరణించారు. 


Also read: Indian Economy: ప్రపంచంలో మూడవ ఆర్ధిక వ్యవస్థగా ఇండియా, సీఈబీఆర్ నివేదిక ఏం చెబుతోంది


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook