Covid-19 Deaths in America | కరోనావైరస్ తొలి కేసు అధికారికంగా నమోదు అయి ఒక సంవత్సరం అయింది. ఈ కాలంలో అనేక దేశాలను అది పూర్తిగా తన వశంలోకి తీసుకుంది. చాలా దేశాల్లో లక్షలాది మంది దాని వల్ల ప్రభావితం అయ్యారు. అందులో అత్యధికంగా ప్రభావితం అయిన దేశాల్లో అమెరికా టాప్ లో ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Also Read | Fact Check: కరోనా టీకా వచ్చిసిందా ? వాట్సాప్ మెసేజ్ లో నిజమెంత? 


తొలూత అమెరికాలో ( America) కేసుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. అయితే చాలా తక్కువ కాలంలో అది అన్ని దేశాలను దాటేసింది. తాజాగా అ దేశంలో కరోనావల్ల మరణించిన వారి సంఖ్య రెండున్నర లక్షలను దాటేసింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. 


అమెరికాలో ఇప్పటి వరకు నమోదు అయిన కోవిడ్-19 ( Covid-19) కేసుల సంఖ్య 1,15,17,455 గా ఉంది. సగటున అక్కడ ప్రతీ రోజు లక్షకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. వేలాది మంది మరణిస్తున్నారు. దాంతో పాటు ప్రస్తుతం చలికాలం కావడంతో కోవిడ్-19 సంక్రమించే అవకాశం రెట్టింపు అయింది. 



Also Read | Women Empowerment : మహిళల కోసం ప్రత్యేక సేవింగ్ ఎకౌంట్, వడ్డీ ఎంతో తెలుసా?


దీన్ని గమనించిన అమెరికా ప్రభుత్వం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మొదలు పెట్టింది. స్కూళ్లు కాలేజీలు మూసివేశారు. బార్లు రెస్టారెంట్లపై ఆంక్షలు పెంచారు. అమెరికా తరువాత అత్యధికంగా కరోనా వైరస్ ( Coronavirus) వల్ల మరణాల సంఖ్య విషయంలో దేశాల్లో బ్రెజిల్, భారత్, మెక్సికోలు టాప్ లో ఉన్నాయి.



A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR