Oxford-AstraZeneca vaccine: పొరపాటును విన్నింగ్ ఫార్ములాగా మార్చుకున్న వైనం
Oxford-AstraZeneca vaccine: కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్..సక్సెస్ ఫార్ములాను ఆక్స్ ఫర్డ్-ఆస్ట్రాజెనెకా కనుగొంది. డబుల్ డోస్ విధానంలో నూటికి నూరుశాతం వైరస్ నుంచి రక్షణ కల్పిస్తుందని ఆస్ట్రాజెనెకా వెల్లడించింది.
Oxford-AstraZeneca vaccine: కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్..సక్సెస్ ఫార్ములాను ఆక్స్ ఫర్డ్-ఆస్ట్రాజెనెకా కనుగొంది. డబుల్ డోస్ విధానంలో నూటికి నూరుశాతం వైరస్ నుంచి రక్షణ కల్పిస్తుందని ఆస్ట్రాజెనెకా వెల్లడించింది.
ప్రపంచవ్యాప్తంగా వణికిస్తున్న కరోనా వైరస్ ( Corona virus ) కు మూడు కంపెనీలు వ్యాక్సిన్ కనుగొన్నాయి. ఇందులో ఫైజర్ ( pfizer ) 95 శాతం సక్సెస్ రేట్‌ను..మోడెర్నా ( Moderna ) 94.5 శాతం సక్సెస్ రేట్‌ను ప్రకటించగా..మూడవ వ్యాక్సిన్ కోవిషీల్డ్ వీటికి సమానంగా ఫలితాలు చూపించిందని ఆస్ట్రాజెనెకా స్పష్టం చేసింది. ముఖ్యంగా డబుల్ డోస్ విధానంలో అయితే విన్నింగ్ ఫార్ములా కనుగొన్నామని తెలిపింది. డబుల్ డోస్ ( Double Dose ) విధానంలో 100 శాతం సక్సెస్ రేట్ సాధించామని ఆస్ట్రాజెనెకా సీఈఓ పాస్కల్ సొరియట్ వెల్లడించారు.
Also read: Vaccination Dry run: రెండ్రోజుల పాటు ఏపీ సహా నాలుగు రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ డ్రై రన్
అయితే డబుల్ డోస్ విధానంలో పూర్తి వివరాల్ని ఇప్పుడే బహిర్గతం చేయలేమని..త్వరలోనే సమగ్ర సమాచారాన్ని ప్రచురిస్తామని కంపెనీ సీఈవో తెలిపారు. ఇప్పటికే అత్యవసర వినియోగం కోసం ఆస్ట్రాజెనెకా ( Astrazeneca ) బ్రిటన్ ప్రభుత్వానికి ( Britain Government ) దరఖాస్తు చేసుకుంది. క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించిన పూర్తి డేటాను రెగ్యులేటరీ ఏజెన్సీలకు సమర్పించింది. జనవరి 4వ తేదీన ఆస్ట్రాజెనెకాకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వవచ్చని తెలుస్తోంది.
Also read: Fact Check: వ్యాక్సిన్ తీసుకుంటే జాంబీలుగా మారుతున్నారా
వాస్తవానికి నవంబర్ నెలలో ఆస్ట్రాజెనెకా క్లినికల్ ట్రయల్స్‌లో తప్పులు దొర్లినట్టు స్వయంగా కంపెనీనే ప్రకటించింది. కొంతమంది వాలంటీర్లకు వ్యాక్సిన్ సగం డోసు మాత్రమే ఇవ్వగా..మరి కొంతమందికి పూర్తి డోసు ఇచ్చినట్టు తెలిపింది. అయితే ఇది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని..అనుకోకుండా జరిగిందని తెలిపింది. అయితే ఆశ్చర్యంగా రెండు పద్ధతుల విధానంతో వ్యాక్సిన్ సామర్ధ్యం పెరిగిందని ఆస్ట్రాజెనెకా ప్రకటించడం గమనార్హం.
డబుల్ డోస్ విధానం ఏమిటి
మొదటి డోసును ముందు సగం మాత్రమే ఇస్తారు. తరువాత నెల రోజులకు రెండో డోసును పూర్తిగా ఇస్తారు. ఈ విధానంతో తమ వ్యాక్సిన్..ఫైజర్, మోడెర్నాలతో సమానంగా ఫలితాల్ని కనబరుస్తోందని కంపెనీ తెలిపింది. అనుకోకుండా జరిగిన తప్పిదాన్నే తాము విన్నింగ్ ఫార్ములా ( Winning Formula ) గా చేసుకున్నామనేది కంపెనీ చెబుతున్న మాట. కానీ ఆస్ట్రాజెనెకా చెబుతున్న విధానంపై సందేహాలు, ప్రశ్నలు వస్తున్నాయి.
Also read: New coronavirus strain: ఫ్రాన్స్‌కు విస్తరించిన కొత్త కరోనా వైరస్..లాక్‌డౌన్ ఆంక్షలు