New coronavirus strain: కరోనా కొత్త స్ట్రెయిన్ దేశాల్ని కబళిస్తోంది. బ్రిటన్ నుంచి ప్రారంభమై అన్ని దేశాలకు విస్తరిస్తోంది. ఇప్పుడు ఫ్రాన్స్‌లో కొత్త కరోనా వైరస్ వెలుగుచూసినట్టు ఆ దేశమే నిర్ధారించడం కలవరం కల్గిస్తోంది.
కరోనా వైరస్ ( Coronavirus ) కొత్త రూపు దాల్చుకుని బ్రిటన్‌లో ప్రారంభమై..ప్రపంచదేశాల్ని గుప్పిట బంధిస్తోంది. ఇప్పటికే ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, ఇటలీ, బ్రెజిల్, ఇండియాలో కొత్త వైరస్ వ్యాపించినట్టు వార్తలొస్తున్నాయి. తుది పరీక్షల అనంతరమే కరోనా కొత్త స్ట్రెయిన్ ( New coronavirus strain ) సంక్రమించిందా లేదా అనేది తేలుతుంది. ఈ క్రమంలో ఫ్రాన్స్‌లో కొత్త రకం కరోనా వైరస్ సంక్రమించినట్టు ఫ్రాన్స్ వైద్యాధికారులు నిర్ధారించడం అందర్నీ ఆందోళనకు గురి చేసింది. ఫలితంగా ఇప్పుడు ఫ్రాన్స్ ( France ) కూడా బ్రిటన్ విమాన రాకపోకలపై నిషేధం విధించింది.
ఫ్రాన్స్‌కు చెందిన ఓ వ్యక్తి యూకే నుంచి డిసెంబర్ 19న తిరిగొచ్చాడు. పరీక్షలు నిర్వహించగా కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్ ఉన్నట్టు తేలింది. ఫ్రాన్స్‌తో పాటు ఇతర యూరోపియన్ దేశాల్లో కూడా కొత్త రకం కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయాయి. కొత్త కరోనా వైరస్‌కు అత్యంత వేగంగా విస్తరించే లక్షణముందని..బ్రిటన్ అధికారులు వెల్లడించారు. బ్రిటన్ ( Britain ) లో కొత్త వైరస్ వెలుగుచూసిందని తెలియగానే..దాదాపు 40 వరకూ దేశాలు బ్రిటన్ విమాన రాకపోకలపై నిషేధం విధించాయి.
Also read: Fact Check: వ్యాక్సిన్ తీసుకుంటే జాంబీలుగా మారుతున్నారా