ఎట్టకేలకు పాక్ పై భారత్ తీసుకొచ్చిన ఒత్తిడి ఫలించింది. వారి సైన్యానికి చిక్కిన భారత యుద్ధ విమాన ఫైలట్ అభినందన్ విషయంలో దౌత్యపరంగా మన అధికారులు చేసి ప్రయత్నాలు ఫలించాయి. అభినందన్ ను రిలీజ్ చేసేందుకు సిద్ధమని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆ దేశ పార్లమెంట్ సాక్షిగా ప్రకటించారు. విడుదలకు రేపు ఏర్పాట్లు చేస్తామని తెలిపారు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పాక్ పార్లమెంట్ లో ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ  రెండు దేశాలు శాంతిగా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. పాక్ శాంతికి కట్టుబడి ఉందన్న దానికి ఇదే సంకేతమన్నారు. ఇకనైనా భారత్ ఉద్రిక్తతను తగ్గించుకోవాలని సూచిస్తున్నామన్నారు. ఈ విషయంలో చర్చలకు సిద్ధమని ప్రకటించారు


ఒక వేళ మీరు వెనక్కి తగ్గకపోతే తప్పకుండా బదులివ్వక తప్పదని పేర్కొన్నారు. యుద్ధం తలెత్తితే పాకిస్తాన్ సైన్యం అన్నింటికీ సిద్ధపడే ఉందన్నారు. భాద్యతయుతమైన దేశంలో మరో దేశానికి అణగదొక్కాలని ప్రయ్నతించదు.. కాబట్టి భారత్ బాధ్యతాయుతంగా వ్యవహించాలని చురకలు అంటించారు


యుద్ధంతో సాధించేది ఏదీ ఉండదు...దీంతో  ఇరు దేశాలకూ నష్టమేనని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. ఉద్రిక్తతను తగ్గించేందుకు అంతర్జాతీయ సమాజం కూడా తమ వంతు ప్రయత్నం చేయాలని  కోరారు. శాంతి చర్చలకు ఎన్నిసార్లు ప్రతిపాదించిన భారత దేశ ప్రధాని ముందుకు రాలేదని ఈ సందర్భంగా ఇమ్రాన్ ఖాన్  విమర్శించారు


భారత యుద్ధంపైలట్ ను అభినందన్ రిలీజ్ చేయడాన్ని ప్రతి భారతీయుడు స్వాగతిస్తున్నాడు. అయితే ఈ రిలీజ్ తో ఉగ్రవాద సమస్య సమసి పోదని.. పాక్ లో ఉగ్రవాద సమస్యను పరిస్కరించకుండా ఒక్క యుద్ధఖైదీని రిలీజ్ చేసినంత మాత్రానా శాంతినెలకొల్పడం కాదని.. ఉగ్రవాద నిర్మానల కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలకు సహకరిస్తే శాంతికి కట్టినట్లుగా భావిస్తామని .. జైషే మూకలను తరిమికొట్టే వరకు భారత వెనక్కి తగ్గకూడదనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి