పాకిస్తాన్ లో కొత్త చట్టాలు వచ్చాయి. అత్యాచారం చేస్తే ఇక అంతే సంగతులు. ఏకంగా మగతనం లేకుండా చేస్తారు. కేబినెట్ ఆమోదించిన ఈ కొత్త చట్టాల్ని ఇంకా పాక్ అధ్యక్షుడు ఆమోదించాల్సి ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


పాకిస్తాన్ ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ( Imran khan Government ) ఆ దేశంలో కొత్తగా రెండు ఆర్డినెన్సుల్ని ( New Ordinance ) ప్రవేశపెట్టింది. ఈ రెండు ఆర్డినెన్సులకు పాక్ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇంకా పాక్ అధ్యక్షుడు ఆమోదించాల్సి ఉంది. రేపిస్టులకు కెమికల్ క్యాస్ట్రేషన్ ( Chemical Castration ) చేయడం అంటే రసాయనాల ద్వారా పుంసకత్వాన్ని దెబ్బతీయడం, అత్యాచారాల విచారణకు ప్రత్యేక కోర్టుల్ని ఏర్పాటు చేయడమనే రెండు కొత్త ఆర్డినెన్సుల్ని తీసుకొచ్చింది. కొత్త చట్టాల ప్రకారం అన్నివయస్సుల స్త్రీలను మహిళగా నిర్వచిస్తారు. 


ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టం ప్రకారం 15 ఏళ్లలోపు స్త్రీలతో సంభోగాన్ని మాత్రమే రేప్ ( Rape ) ‌గా పరిగణిస్తారు. అలాగే రేప్‌కు విధించే కెమికల్‌ కాస్ట్రేషన్‌ ప్రభావం కేసు స్వభావాన్ని అంటే తొలిసారి నేరం చేశారా లేక పదేపదే ఇలాంటి నేరాలు చేస్తున్నారా అనే విషయాన్ని బట్టి తాత్కాలికంగా లేదా శాశ్వతంగా ఉంటుంది. కొత్త చట్టం ప్రకారం రేప్‌ కేసులకు ప్రత్యేక కోర్టులతో పాటు యాంటీ రేప్‌ సెల్స్‌ను కూడా ఏర్పరుస్తారు. అలాగే మహిళల కన్యత్వాన్ని పరీక్షించేందుకు చేసే టూ ఫింగర్‌ టెస్ట్‌ను నిషేధిస్తారు. అత్యాచారానికి పాల్పడినట్టు రుజువైతే మాత్రం ఇక అతడికి మగతనమనేది  లేకుండా చేస్తారు. Also read: Iran: ప్రముఖ న్యూక్లియర్ శాస్త్రవేత్త దారుణ హత్య