General Elections In Pakistan: సార్వత్రిక ఎన్నికలకు ఒక రోజు ముందు పాకిస్థాన్ లో షాకింగ్ పరిణామం చోటు చేసుకుంటుంది. ఈరోజు అనగా.. బుధవారం రోజున నైరుతి పాకిస్థాన్‌ బలుచిస్థాన్ లో పేలుడు సంభవించింది. పిషిన్ జిల్లాలో ఉన్న స్వతంత్ర అభ్యర్థి ఎన్నికల కార్యాలయంలో బాంబు పేలింది. ఈ ఘటనతో ఒక్కసారిగా అక్కడున్న వారంతా పరుగులుపెట్టారు. ఎన్నికలకు ఒక రోజు ముందు స్వతంత్ర అభ్యర్థికార్యాలయంలో లోకల్ ప్రజలు, కార్యకర్తలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఒక్కసారిగా బాంబు పేలడంతో దాదాపు.. 12 మంది చనిపోయినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో  ఆ ప్రాంతమంతా శవాల దిబ్బలాగా మారిపోయింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read More: Nawabi Semai : నవాబులనాటి నోరూరించే సేమియా.. గిన్నె ఖాళీ చేయాల్సిందే


అక్కడున్న ఇళ్లన్ని కూడా కూలీపోయాయి. ఆ ప్రాంతం నుంచి ప్రజలకు సెఫ్టీ ప్రదేశాలకు పరుగులు పెట్టారు. మరోవైపు పాక్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలను ముమ్మరం చేశారు. ఇదిలా ఉండగా.. మొదటి బాంబు పేలిన గంటల వ్యవధిలోనే మరో బాంబు పేలుడు ఘటన సంభవించింది. మొదటి పేలుడు జరిగిన ప్రదేశానికి.. 150 కి.మీ (93 మైళ్లు) దూరంలో ఉన్న ఖిల్లా సైఫ్ ఉల్లా జిల్లాలో రెండవ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో మరో ఎనిమిది మంది మరణించినట్లు సమాచారం. రెండు పేలుళ్లలో కూడా వందలాది మంది గాయపడినట్లు తెలుస్తోంది. రెండు ఘటనలో కలిపి దాదాపు ..22 మంది వరకు మరణించి ఉంటారని సమాచారం. 


గ్యాస్-రిచ్ ప్రావిన్స్, ఆఫ్ఘనిస్తాన్ , ఇరాన్‌లకు సరిహద్దుగా ఉంది. రెండు దశాబ్దాలుగా బలూచ్ జాతీయవాదుల తిరుగుబాటుతో వ్యవహరిస్తోంది. మొదట్లో వనరుల కోసం ఇద్దరు పోటీపడ్డారు. ఆ తరువాత స్వాతంత్ర్యం కోసం గొడవలు ప్రారంభమయ్యాయి. పాకిస్థాన్ లో..  తాలిబాన్,  ఇతర తీవ్రవాద గ్రూపులు కూడా ఈ ప్రాంతంలో గణనీయమైన ఉనికిని కలిగి ఉన్నాయి. అయితే.. ఇప్పటికి బాంబు దాడికి బాధ్యత వహిస్తున్నట్లు ఏ గ్రూపు కూడా ప్రకటించలేదు.


Read More: Dil Raju: రేవంత్ రెడ్డి దగ్గరికి దిల్ రాజు.. ఆశిష్ పెళ్లికార్డ్ అందజేసిన ఫ్యామిలీ


ఎన్నికలకు ఒక రోజు ముందు ఇలాంటి ఘటనలు జరగటం పట్ల ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే మాజీ ప్రధాని  ఇమ్రాన్ ఖాన్ ను ఉరితీస్తారన్న వార్తలు కూడా జోరందుకున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం ఎన్నికలు హింసాత్మకంగా జరిగి, రిగ్గింగ్ కు పాల్పడవచ్చని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎన్నికలు ఒకింత హింసాత్మకంగా జరగొచ్చని వార్తలు మాత్రం వైరల్ అవుతున్నాయి. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook