Nawabi Semai : నవాబులనాటి నోరూరించే సేమియా.. గిన్నె ఖాళీ చేయాల్సిందే

Nawabi Semai Recipe:  కొంతమందికి ఇప్పటికీ నవాబుల నాటి కాలం ఆహార పదార్థాలు అంటే ఎంతో ఇష్టం. ముఖ్యంగా వాళ్ల కాలంలో నోటికి తీపినందించే స్వీట్లు వివిధ రకాల పద్ధతిలో తయారు చేసుకునేవారు. అయితే ఈరోజు నవాబుల నాటి స్వీట్ రెసిపీని మీకు అందించబోతున్నాం.  

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 6, 2024, 10:04 PM IST
Nawabi Semai : నవాబులనాటి నోరూరించే సేమియా..  గిన్నె ఖాళీ చేయాల్సిందే

Nawabi Semai Recipe: ప్రస్తుతం సెమై అంటే ఎవరికీ తెలియదు. ఇప్పుడు అందరూ నోటిని తీపి చేసుకునేందుకు కేవలం సేమ్యానే తయారుచేసుకుని తింటున్నారు. నిజానికి ఈ సెమై అనేది నవాబుల కాలంలో ఎంతో ఫేమస్.. అప్పుడు నవాబులంతా నోటిని తీపి చేసుకునేందుకు ఎక్కువగా సెమైనే తీసుకునే వారట. ఇది చూడడానికి అచ్చం పాయసంలా ఉన్న  నోటికి ఎంతో మధురమైన రుచిని అందిస్తుంది. తియ్య‌గా, క‌మ్మ‌గా ఉండే దీనికి ఇప్పటికి కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారంటే నమ్మదగిన విషయమే.. దీనిని చాలావరకు పెద్దపెద్ద రెస్టారెంట్లలో ఎక్కువగా సర్వ్ సర్వ్ చేస్తారు. ముఖ్యంగా ఎంతో చారిత్రాత్మక కలిగిన హైదరాబాద్ లోని కొన్ని రెస్టారెంట్లలో ఇప్పటికీ సర్వ్ చేస్తున్నారు. అంతేకాకుండా చాలామంది ఎంతో కష్టపడి ఇళ్లలో కూడా తయారు చేసుకుంటున్నారు. అయితే ఇకనుంచి దీనిని తయారు చేసుకోవడానికి పెద్దగా కష్టపడనక్కర్లేదు. ఈ నోరూరించే  సెమైని సులభంగా తయారు చేసుకోండి ఇలా..

న‌వాబి సెమై తయారు చేసుకోవడానికి అవసరమైన పదార్థాలు:

సన్నని నెయ్యితో తయారుచేసిన పొడవు గల సేమియా 200 గ్రాములు
సగం కప్పు నెయ్యిలో వేయించిన జీడిపప్పు
ముప్పావు కప్పు నెయ్యిలో వేయించిన బాదంపప్పు
యాలకులు ఐదు
మూడు టేబుల్ స్పూన్ల దేశీ నెయ్యి
అర లీటర్ కంటే ఎక్కువగా చిక్కని పాలు
రెండు టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్

తయారీ పద్ధతి:

ముందుగా నెయ్యితో తయారుచేసిన సేమ్యాలను చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత ఒక మిక్సీ జార్లో యాలకులు నెయ్యిలో వేయించిన బాదం జీడిపప్పును సన్నని పొడిలా తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత అదే జార్ లో పంచదార వేసి కూడా మిక్సీ పట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా మిక్సీ పట్టుకున్న రెండింటిని గిన్నెలో పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత స్టౌ పై కళాయి పెట్టుకుని అందులో మూడు టీ స్పూన్ల నెయ్యిని వేడి చేసుకోవాల్సి ఉంటుంది. 

ఇలా వేడి చేసుకున్న నెయ్యిలో కట్ చేసుకున్న సన్నని సేమియాను వేసుకుని రంగు మారేంతవరకు వేయించుకోవాల్సింది. ఇలా వేయించుకున్న తర్వాత సన్నని పొడిలా తయారు చేసుకున్న చక్కెరను వేసి బాగా కలుపుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా మిక్సీ పట్టుకున్న బాదం యాలకుల పొడిని కూడా అందులో వేసి మాడకుండా సన్నని సెగపై అటు ఇటు కలుపుతూ బాగా వేయించుకోవాలి. ఇలా నాలుగు నిమిషాల పాటు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా వేయించుకున్న సేమ్యాను రెండు భాగాలుగా చేసుకొని రెండు కప్పుల్లో సపరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. 

ఆ తర్వాత ఒక కప్పులో కస్టర్డ్ పౌడర్ వేసి మరిగించుకున్న పాలను పోసుకొని ఉండల్లేకుండా జాగ్రత్తగా కలుపుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇందులో మిక్సీ పట్టుకున్న మిగిలిన షుగర్ పౌడర్ బాదం యాలకుల పౌడర్ని వేసి స్టవ్ పై పెట్టి ఐదు నిమిషాల పాటు సన్నని సెగపై మరిగించాల్సి ఉంటుంది. మరిగించిందంతా దగ్గర పడ్డాక మిగిలిన సేమ్యాను వేసుకుని మరో రెండు నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్న తర్వాత పైనుంచి నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ ని వేసుకొని సర్వ్ చేసుకుని తినొచ్చు.

Also Read: Parenting Tips : మీరు చెప్పినమాట మీ పిల్లలు అస్సలు వినట్లేదా.. అయితే ఇలా చేసిచూడండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News