Pakistan Woman MLA obscene video leaked : పాకిస్తాన్‌లో ఓ మహిళా ఎమ్మెల్యే అశ్లీల వీడియో సోషల్ మీడియాలో లీకవడం తీవ్ర కలకలం రేపుతోంది. గత కొద్దిరోజులుగా సోషల్ ప్లాట్‌ఫామ్స్‌లో ఆ వీడియో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో ఉన్నది పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ ఎమ్మెల్యే సానియా ఆషిక్‌‌గా (Sania Ashiq) ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఆమె పంజాబ్ ప్రావిన్స్‌లోని తక్షిలా అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ వీడియోపై ఎమ్మెల్యే సానియా ఆషిక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ఏడాది అక్టోబర్‌లో ఆ వీడియో (Viral video) ఎమ్మెల్యే సానియా ఆషిక్ దృష్టికి వచ్చిందని... అదే నెల 26న ఆమె ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (FIA)కి ఫిర్యాదు చేశారని పాకిస్తాన్ మీడియా వెల్లడించింది. సోషల్ మీడియాలో (Social Media) తన పేరిట పోర్నోగ్రఫీ వీడియోను వైరల్ చేస్తున్నారని ఎమ్మెల్యే సానియా తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపింది. ఆ వీడియోలో ఉన్నది ఎమ్మెల్యే సానియానే అని చాలామంది నెటిజన్లు కామెంట్స్ చేస్తుండగా... ఆ ప్రచారాన్ని ఆమె ఖండించారు. ఆ వీడియో తనది కాదని స్పష్టం చేశారు. తన పరువుకు భంగం కలిగించేందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


Also Read: అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా కమలా హారిస్ రికార్డు!


సానియా ఫిర్యాదుపై దాదాపు 3 వారాల దర్యాప్తు అనంతరం లాహోర్‌కి చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అతని వివరాలేవీ పోలీసులు బయటకు వెల్లడించలేదు. అలాగే ఆ వీడియోలో ఉన్నది సానియానా, మరొకరా అన్న విషయం కూడా పోలీసులు ఇప్పటివరకూ ధ్రువీకరించలేదు. ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. పాకిస్తాన్ మీడియా కథనాల ప్రకారం... పాక్ (Pakistan) మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం నవాజ్‌కు సానియా సన్నిహితురాలు. ప్రస్తుత ఇమ్రాన్ (Imran Khan) ప్రభుత్వం అవలంభిస్తున్న పలు విధానాలకు వ్యతిరేకంగా ఆమె పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె బెదిరింపు కాల్స్ కూడా ఎదుర్కొంటున్నారు.
 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook