Rail Accident: ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 11 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా..వందలాదిమందికి గాయాలయ్యాయి. రైలు ప్రమాద ఘటనపై దర్యాప్తు ప్రారంభమైంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈజిప్టులో ఘోర ప్రమాదం(Egypt Accident) చోటు చేసుకుంది. ఉత్తర కైరోలోని బన్తాలో ప్యాసెంజర్ రైలు పట్టాలు ( Passenger train derailed) తప్పడంతో ప్రమాదం తలెత్తింది. దేశ రాజధాని కైరో (Cairo) నుంచి మన్సౌరాకు వెళ్తున్న సమయంలో హఠాత్తుగా నాలుగు భోగీలు పట్టాలు తప్పడంతో భారీ ప్రమాదం తలెత్తింది. ఈ ఘటనలో 11 మంది ప్రయాణీకులు అక్కడికక్కడే ప్రాణాలు పోగొట్టుకున్నారు. వందలాదిమందికి గాయాలయ్యాయి. ప్రమాదంలో గాయపడినవారిని రక్షించేందుకు ఆంబులెన్స్, వైద్య సిబ్బంది హటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఎవరికి వారు ప్యాసెంజర్ రైలులో ఉన్న తమవారిని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 


ఈ ఘటనపై ఈజిప్టు దేశాధ్యక్షుడు అబ్దుల్ ఫట్టా అల్ సిసి విచారం వ్యక్తం చేశారు. రైలు ప్రమాద ఘటన ( Train accident)పై దర్యాప్తుకు ఆదేశించారు. రైలు పట్టాలు తప్పడానికి కారణాలింకా తెలియలేదు. రైలు డ్రైవర్, ఇతర సిబ్బందిని పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. 


Also read: Check to China: ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా ఆధిపత్యానికి ఇక చెక్ పడనుందా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook