Check to China: ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా ఆధిపత్యానికి ఇక చెక్ పడనుందా

Check to China: ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా ఆధిపత్యానికి చెక్ పడనుంది. క్వాడ్ కూటమిని మరింత బలోపేతం చేయాలని యూఎస్ , జపాన్ నిర్ణయించడం కొత్త సమీకరణాలకు దారి తీస్తోంది. వైట్‌హౌస్ సాక్షిగా జరిగిన ప్రత్యేక భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 18, 2021, 08:21 PM IST
Check to China: ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా ఆధిపత్యానికి ఇక చెక్ పడనుందా

Check to China: ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా ఆధిపత్యానికి చెక్ పడనుంది. క్వాడ్ కూటమిని మరింత బలోపేతం చేయాలని యూఎస్ , జపాన్ నిర్ణయించడం కొత్త సమీకరణాలకు దారి తీస్తోంది. వైట్‌హౌస్ సాక్షిగా జరిగిన ప్రత్యేక భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇండో పసిఫిక్ రీజియన్‌( Indo pacific region) లో చైనా (China) ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు ఏర్పడిన కూటమి క్వాడ్. ఇప్పుడీ కూటమిని బలోపేతం చేసేందుకు నిర్ణయమైంది. క్వాడ్ కూటమి(Quad Alliance)లో ఇండియా, ఆస్ట్రేలియాలతో కలిసి పని చేసేందుకు అమెరికా, జపాన్ దేశాలు నిర్ణయించాయి. యూఎస్ అధ్యక్షుడు జో బిడెన్( Joe Biden), జపాన్ ప్రధాని యోషిహిడేసుగాల మధ్య వైట్‌హౌస్(White house) సాక్షిగా ప్రత్యేక భేటీ జరిగింది.ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించేందుకు మిత్రదేశాలతో కలిసి పనిచేస్తామని..క్వాడ్‌ను మరింతగా బలోపేతం చేస్తామని ఇరువురు దేశాధినేతలు సంయుక్తంగా ప్రకటించారు.ఇరుదేశాల మధ్య సహకారం పెంపొందిస్తామని నిర్ణయం తీసుకున్నాయి. కరోనా కారణంగా ఏర్పడిన సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఆరోగ్యరంగంలో పరస్పర సహాయ సహకారాలు అందించుకోవాలని యూఎస్, జపాన్ నిర్ణయించాయి. మరోవైపు మయన్మార్ దేశంలో జరుగుతున్న హింసను రెండు దేశాలు ఖండించాయి.

చైనా దేశం తీసుకునే చర్యల కారణంగా ఇండో పసిఫిక్ ప్రాంత శాంతి సామరస్యాలపై పడే ప్రభావంపై చర్చించారు. దక్షిణ చైనా సముద్రంలో(South China sea) 13 లక్షల చదరపు మైళ్ల ప్రాంతం తనదేనని ప్రకటించుకోవడం వియత్నాం(Vietnam), మలేసియా, ఫిలిప్పీన్స్, బ్రూనై, తైవాన్ దేశాల ఆందోళనకు కారణంగా మారుతోంది. మరోవైపు తూర్పు చైనా సముద్రం ( East china sea)తో జపాన్ దేశంతో ఇప్పటికే విబేధాలున్నాయి. ఈ రెండు ప్రాంతాలు విలువైన ఖనిజాలున్న ద్వీపాలకు వేదిక కావడంతో చైనా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఐరాస తీర్మానం ప్రకారం ఈ ప్రాంతంలో స్వేచ్ఛాయుత నౌకాయానానికి వీలుండాలని యూఎస్, జపాన్ దేశాలు తెలిపాయి. 

Also read: Coronavirus spread: కరోనా వైరస్ సంక్రమణ గాలి ద్వారానే అత్యదికమని నిరూపణ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News