కరోనా వ్యాక్సిన్‌ ( Corona vaccine )పై మరో గుడ్‌న్యూస్ అందుతోంది. ప్రముఖ అంతర్జాతీయ కంపెనీ ఫైజర్ ( Pfizer ) చేసిన ప్రకటన ఉత్సాహం కల్గిస్తోంది. మూడవ దశ ప్రయోగాలు 90 శాతం విజయవంతమైనట్టు ప్రకటించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్  ప్రయోగాలు పూర్తి కావస్తున్నాయి. ప్రముఖ కంపెనీల  వ్యాక్సిన్‌లు మూడవ దశ ప్రయోగాల్లో ఉన్నాయి. బ్రిటన్‌కు చెందిన ఆక్స్‌ఫర్డ్- ఆస్ట్రాజెనెకా ( Oxford-AstraZeneca vaccine ) యూనివర్శిటీ వ్యాక్సిన్ డిసెంబర్, జనవరికి మార్కెట్లో విడుదలకు ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో అమెరికాకు చెందిన ఫైజర్ సైతం గుడ్‌న్యూస్ అందించింది. ఆ సంస్థ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ మూడవ దశ ప్రయోగాల్లో ఉంది. ఈ ఫలితాలు 90 శాతం విజయవంతమైనట్టు ఫైజర్ ప్రకటించింది. మొదటిసారి డోసు ఇచ్చిన 28 రోజులకు రెండోసారి రెండు డోసులిచ్చారు. 7 రోజుల అనంతరం సురక్షితంగా ఉన్నట్టు తెలిసింది.  


తాము అబివృద్ధి చేసిన వ్యాక్సిన్ ..కరోనా వైరస్‌ను ( Corona virus ) అరికట్టడంతో విజయవంతంగా పని చేస్తుందని మూడోదశ ప్రయోగాల్లోని తొలి‌సెట్‌లో తెలిసిందని ఫైజర్ సీఈవో ఆల్బర్ట్ బోర్లా తెలిపారు. మరోవైపు ఆక్స్‌ఫర్డ్ - ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ఉత్పత్తిని ఆస్ట్రేలియా కంపెనీ సీఎస్ఎల్ లిమిటెడ్ ( CSL Limited ) ఇవాళే ప్రారంభించింది. దాదాపు 3 కోట్ల వ్యాక్సిన్ ఉత్పత్తి జరిగినట్టుగా తెలుస్తోంది. 


ఇదే వ్యాక్సిన్‌ను ఇండియాకు చెందిన సీరమ్ ఇనిస్టిట్యూట్ ( Serum institute ) ఉత్పత్తి కూడా త్వరలో ప్రారంభం కానుంది. డిసెంబర్-జనవరి నాటికి వ్యాక్సిన్ అందుబాటులో వస్తుందని ఇప్పటికే సీరమ్ ప్రటించింది. Also read: UAE : ఇకపై అక్కడ మద్యపానం, సహజీవనం రెండూ ఆమోదమే