Philippines Rai Typhoon: ఫిలిప్పీన్స్‌లో `రాయ్` బీభత్సం- 100 దాటిన మృతుల సంఖ్య!
Philippines Rai Typhoon: ఫిలిప్పీన్స్‌లో రాయ్ తుపాను బీభత్సం సృష్టించింది. ఈ తుపాన్ ధాటికి 100 మందికి పైగా మృతి చెందారు.
Philippines Rai Typhoon: ఫిలిప్పీన్స్‌లో బీభత్సం సృష్టించిన 'రాయ్' తుపాన్(Rai Typhoon)..ఆ దేశాన్ని పూర్తిగా అంధకారంలోకి నెట్టేసింది. రెండే రోజుల్లో యావత్ దేశాన్ని అల్లకల్లోలం చేసింది. దీంతో ఫిలిప్పీన్స్(Philippines) కోలుకోలేని స్థితికి చేరింది. ఎటూ చూసిన శిథిలమైన ఇళ్లు, నేలకొరిగిన వృక్షాలే కనిపిస్తున్నాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సమాచార, రవాణా వ్యవస్థలు స్తంభించిపోయాయి. తుపాను ధాటికి మృతి చెందిన వారి సంఖ్య 100 దాటింది. పలువురి ఆచూకీ గల్లంతయినట్లు అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
ఒక్క బోహోల్ ప్రావిన్స్‌లోనే 63 మంది ప్రాణాలు కోల్పోయినట్లు గవర్నర్ ఆర్థుర్ యాప్ ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ఫిలిప్పీన్స్ ప్రెసిడెంట్ రొడ్రిగో డుటెర్టే(Rodrigo Duterte) దెబ్బతిన్న పలు ప్రాంతాలను సందర్శించారు. 2 బిలియన్ పెసోస్(40 మిలియన్ డాలర్లు) సాయం ప్రకటించారు. తుపాను కారణంగా 7,80,000 మంది ప్రభావితమైనట్లు ఫిలిప్పీన్స్ ప్రభుత్వం(Philippines Govt) వెల్లడించింది.
Also Read: Philippines Typhoon: ఫిలిప్పీన్స్‌లో 'రాయ్'’ తుపాను బీభత్సం.. 23 మంది మృతి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook