Philippines Typhoon: ఫిలిప్పీన్స్​లో 'రాయ్‌'’ తుపాను బీభత్సం.. 23 మంది మృతి..

Philippines Typhoon: ఫిలిప్పీన్స్​లో తుపాను బీభత్సం సృష్టించింది. తుపాను ధాటికి 23 మంది మృతి చెందారు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 18, 2021, 05:59 PM IST
  • ఫిలిప్పీన్స్​లో తుపాను బీభత్సం
  • 23 మంది మృతి
  • అంధకారంలో ఫిలిప్పీన్స్ దేశం
Philippines Typhoon: ఫిలిప్పీన్స్​లో 'రాయ్‌'’ తుపాను బీభత్సం.. 23 మంది మృతి..

Philippines Typhoon: ఫిలిప్పీన్స్​(Philippines)లో ‘'రాయ్‌'’ తుపాను(Rai Typhoon) విధ్వంసం సృష్టించింది. తుపాను ధాటికి 23 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ దేశంలోని అన్ని రాష్ట్రాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సమాచార, రవాణా వ్యవస్థలు స్తంభించిపోయాయి. ముఖ్యంగా సెంట్రల్​ ఫిలిప్పీన్స్​లో తుపాను ప్రభావం ఎక్కువగా ఉంది. 

3 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. రాయ్​ తుపాను కారణంగా గంటకు 195-270 కిలోమీటర్ల వేగంగా ఈదురు గాలులు వీచినట్లు అధికారులు తెలిపారు. గాలుల ధాటికి భారీ వృక్షాలు నెలకొరిగాయని, చాలా ఇళ్లు ధ్వంసమయ్యాయి. 

Also Read: Fire accident in Japan: జపాన్‌ ఒసాకాలో భారీ అగ్నిప్రమాదం-27 మంది మృతి

తుపాను బీభత్సానికి తమ రాష్ట్రం పూర్తిగా  నేలమట్టమైందని డినాగాట్​ ఐలాడ్స్​ ప్రావిన్స్​ గవర్నర్​ బగావు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు ఆహారం, మంచినీళ్లు, తాత్కాలిక షెడ్లు, పరిశుభ్రత కిట్లు, మందులు అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దక్షిణ, కేంద్ర ఫిలిప్పీన్స్​లోని రాష్ట్రాలను అతలాకుతలం చేసిన రాయ్​ తుపాను శుక్రవారం రాత్రి తీరం దాటి దక్షిణ చైనా సముద్రం(South China Sea) వైపు కదిలిందని అధికారులు వెల్లడించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News