కజకిస్తాన్‌లో ఘోర విమాన ప్రమాదం
కజకిస్తాన్ లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 95 మంది ప్రయాణీకులు, ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న విమానం అకస్మాత్తుగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమాన ప్రయాణీకులు ఎంత మంది చనిపోయారనే విషయం తెలియాల్సి ఉంది.
కజకిస్తాన్ లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 95 మంది ప్రయాణీకులు, ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న విమానం అకస్మాత్తుగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమాన ప్రయాణీకులు ఎంత మంది చనిపోయారనే విషయం తెలియాల్సి ఉంది. అల్మటీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయల్దేరిన బెక్ ఎయిర్ విమానం.. టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే కుప్పకూలింది. సాంకేతిక లోపం కారణంగా అది కుప్ప కూలినట్లు తెలుస్తోంది. విమానం .. నేరుగా కింద ఉన్న ఓ రెండస్తుల భవనంపై పడడంతో ... అందులో నివసిస్తున్న 9 మంది అక్కడికక్కడే మృతి చెందారు.
[[{"fid":"180734","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
కొనసాగుతున్న సహాయ చర్యలు
విమాన ప్రమాదం జరిగిన వెంటనే .. ఘటనా స్థలానికి అగ్నిమాపక అధికారులు, సిబ్బంది చేరుకున్నారు. విమానం నుంచి వస్తున్న అగ్ని కీలలను అదుపు చేశారు. శిథిలాలను తొలగించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై కజకిస్తాన్ విదేశాంగ శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇప్పటి వరకు 9 మంది మృతి చెందినట్లు ప్రకటించింది. విమాన ప్రమాదంపై సమగ్ర విచారణకు ఆదేశించారు. మరోవైపు ప్రయాణీకుల బంధువులు.. అల్మటీ విమానాశ్రయానికి చేరుకుంటున్నారు. తమ వారి జాడ తెలియకపోవడంతో అధికారులను అడుగుతున్నారు.