PM Modi Us Tour: మోదీ, జో బిడెన్ మధ్య చర్చకు రానున్న ఆ కీలక అంశాలేంటి
PM Modi Us Tour: భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ బేటీకు మరి కొద్దిగంటల సమయం మిగిలింది. వాషింగ్టన్‌లో జరగనున్న ఈ ఇద్దరి భేటీలో ఆఫ్ఘన్ పరిణామాలపై కీలక చర్చ జరగనున్నట్టు తెలుస్తోంది.
PM Modi Us Tour: భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ బేటీకు మరి కొద్దిగంటల సమయం మిగిలింది. వాషింగ్టన్‌లో జరగనున్న ఈ ఇద్దరి భేటీలో ఆఫ్ఘన్ పరిణామాలపై కీలక చర్చ జరగనున్నట్టు తెలుస్తోంది.
క్వాడ్ దేశాధినేతల(Quad Meeting)సమావేశానికి అమెరికా వేదికవుతోంది. సెప్టెంబర్ 24వ తేదీన వాషింగ్టన్‌లో క్వాడ్ దేశాధినేతల సమావేశం జరగనుంది. ప్రధాని మోదీ(Narendra modi) ఈ సమావేశంలో పాల్గొనేందుకు రేపు అమెరికా వెళ్లనున్నారు. మోదీ, జో బిడెన్ మధ్య ఆఫ్ఘనిస్తాన్ పరిణామాలు, సీమాంతర ఉగ్రవాదంపై పోరాటం అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలపై పోరాటం, ఇండియా-అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాల పటిష్టత వంటి విషయాలపై ప్రధానంగా చర్చ జరగనుంది. అమెరికా అధ్యక్షుడిగా బాథ్యతలు చేపట్టిన తరువాత జో బిడెన్..భారత ప్రధానితో(Joe Biden-Narendra modi Bilateral Talks)భేటీ కానుండటం ఇదే మొదటిసారి. ఇరు దేశాల మధ్య వ్యాపార, వాణిజ్య సంబంధాలు, పెట్టుబడులు, రక్షణ రంగంలో పరస్పర సహకారం వంటి కీలకాంశాలపై ఇరువురూ చర్చించనున్నారు.
అమెరికా పర్యటన అనంతరం ఈ నెల 26న ఇండియా తిరిగి రానున్నారు. జో బిడెన్‌తో(Joe Biden) సమావేశంతో పాటు క్వాడ్ దేశాధినేతల సమావేశం జరగనుంది. అనంతరం అంటే ఈ నెల 25వ తేదీన న్యూయార్క్‌లో జరగనున్న ఐక్యరాజ్యసమితి 76వ సాధారణ సమావేశంలో ప్రసంగించనున్నారు. అటు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌తో(Kamala Harris) కూడా చర్చించనున్నారు. ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, వాతావరణ మార్పులు వంటి అంశాలు ప్రస్తావనకు రానున్నాయి. జో బిడెత్‌తో చర్చల అనంతరం ఆస్ట్రేలియా, జపాన్ ప్రధానమంత్రులతో కూడా ప్రధాని మోదీ భేటీ కానున్నారు. ఐక్యరాజ్యసమితి(UNO) భద్రతా మండలిలో చేపట్టాల్సిన సంస్కరణలు చర్చకు రానున్నాయి.
Also read: Amazon Legal Issues: ఇండియాలో అమెజాన్ వివాదాలు, లీగల్ ఫీజులు ఫీజులు కోట్లలో
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook