Vaccine Protest: ఆస్ట్రేలియాలో వ్యాక్సిన్ వ్యతిరేక నిరసనలు జరుగుతున్నాయి. వ్యాక్సిన్ తప్పనిసరి చేయడంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పారు. రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆస్ట్రేలియాలో(Australia)వ్యాక్సిన్ నిరసనలు పెల్లుబికాయి. దేశమంతా భారీగా ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు జరుగుతున్నాయి. రాజధాని మెల్‌బోర్న్‌లో(Melbourne) నిర్మాణరంగ కార్మికులు రోడ్డెక్కారు. నిర్మాణరంగంలో పనిచేసేవారు ఒక్క డోసైనా వ్యాక్సిన్ వేయించుకోవాలనే నిబంధన పెట్టడంతో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాదాపు వేయిమంది నిరసనకారులు రోడ్డెక్కారు. నిర్మాణకారులు ధరించే జాకెట్లు, బూట్లతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పారు. అటు ప్రభుత్వం కూడా భారీగా పోలీసుల్ని రంగంలో దింపి..నిరసన అణచివేసే ప్రయత్నం చేసింది.


నిరసనకారుల్ని(Protest on Vaccination)అణచివేసేందుకు పోలీసులు పెప్పర్ స్ప్రే, రబ్బర్ బాల్ గ్రైనేడ్స్, ఫోమ్‌బాటన్ రౌంట్లను ప్రయోగించారు.ఈ ఘటనలో ముగ్గురు పోలీసులకు గాయాలు కాగా..40మంది నిరనసకారుల్ని అరెస్టు చేశారు. మెల్‌బోర్న్ సహా పలు నగరాల్లో నిర్మాణ పనుల్ని రెండువారాల పాటు నిలిపివేయనున్నట్టు ప్రకటన వెలువడింది.కోవిడ్ కేసుల్ని నియంత్రించేందుకు ప్రభుత్వం వ్యాక్సిన్ తప్పనిసరి చేస్తే..ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇలా నిరసన పెల్లుబుకుతోంది.


Also read: Children Vaccine: చిన్నారులకు కోవాగ్జిన్ వ్యాక్సిన్ త్వరలో ప్రారంభం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook