Rishi Sunak relatives: భారత సంతతి వ్యక్తి రిషి సునాక్ విజయాన్ని భారతీయులు అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే మరీ ముఖ్యంగా రిషి సునాక్‌తో సాన్నిహిత్యం, బంధుత్వం ఉన్న వారి కుటుంబాల్లో ఈ సంబరాలు మరింత ఎక్కువగా కనిపించాయి. రిషి సునాక్‌కి పంజాబ్‌లోని లుథియానాలో సమీప బంధువులు ఉన్నారు. అలాగే ఆయన అత్తగారి ఇల్లయిన బెంగళూరుతో పాటు కర్ణాటకలోని ఇతర ప్రాంతాల్లోనూ రిషి సునాక్‌కి సమీప బంధువులు ఉన్నారు. ఈ నేపథ్యంలో రిషి సునాక్ యునైటెడ్ కింగ్ డమ్ ప్రధానిగా ఎన్నిక అవడంపై వారు హర్షం వ్యక్తంచేస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రిషి సునాక్ బ్రిటన్ ప్రధాని కావడంపై పంజాబ్ లుథియానాలో ఉన్న రిషి సునాక్ బంధువులు మీడియాతో మాట్లాడుతూ.. ఒకప్పుడు భారత్‌ని పరిపాలించిన బ్రిటిషర్లకే ఇప్పుడు మన భారతీయుడు ప్రధాని కావడం భారతీయులు అందరికీ ఎంతో గర్వకారణంగా ఉందని సంతోషం వ్యక్తంచేశారు. రిషి సునాక్ తల్లి ఉషా సునాక్‌కి కజిన్ అయిన సుభాష్ బెర్రి ప్రస్తుతం లుధియానాలోనే ఉన్నారు. రిషి సునాక్ కుటుంబంతో తనకున్న బంధుత్వం, అనుబంధం గురించి సుభాష్ బెర్రి మాట్లాడుతూ.. తన భార్య చనిపోయినప్పుడు చివరిసారిగా రిషి సునాక్ తాతయ్య రఘుబీర్ బెర్రీ లుధియానా వచ్చినట్టు గుర్తుచేసుకున్నారు. 


ప్రస్తుతం అది పాకిస్థాన్‌లో ఉంది
రఘుబీర్ బెర్రి వయస్సు ప్రస్తుతం 92 ఏళ్లు. ఆయన లండన్‌లోనే నివాసం ఉంటున్నారు. రిషి సునాక్ తాతయ్య అయిన రఘుబీర్ బెర్రి ఇంకొంత మంది కుటుంబసభ్యులతో కలిసి తొలుత తూర్పు ఆఫ్రికాకు వలస వెళ్లారు. ఆ తరువాత అక్కడి నుండి యునైటెడ్ కింగ్‌డమ్ వెళ్లి అక్కడ స్థిరపడ్డారని సుభాష్ బెర్రి తెలిపారు. రఘుబీర్ బెర్రి స్వస్థలం గుజ్రన్‌వాలా అప్పటి బ్రిటీష్ ఇండియాలో ఉన్నప్పటికీ.. దేశ విభజన తర్వాత ప్రస్తుతం అది పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఉంది.


రిషి సునాక్‌కి సమీప బంధువైన అజయ్ బెర్రి మీడియాతో మాట్లాడుతూ.. ఒకప్పుడు బ్రిటిషర్స్ మన దేశాన్ని పాలిస్తే.. ఇప్పుడు రిషి సునాక్ బ్రిటన్‌ని పాలించే అవకాశం రావడం నిజంగా ఎంతో సంతోషంగా, గర్వంగానూ ఉందని హర్షం వ్యక్తంచేశారు. 


బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్‌కి మాత్రమే ఉన్న గొప్ప ప్రత్యేకత
రిషి సునాక్ మంగళవారం బ్రిటన్ కొత్త ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. యునైటెడ్ కింగ్‌డమ్ ప్రధానిగా రిషి సునాక్ ప్రత్యేకత ఏంటంటే.. ఆ పదవిని అలంకరించిన తొలి భారతీయ సంతతి వ్యక్తి మాత్రమే కాదు.. గత 210 ఏళ్లలో ఆ పదవికి ఎన్నికైన అతి పిన్న వయస్కుడు కూడా రిషినే. ప్రస్తుతం రిషి సునాక్ వయస్సు 42 ఏళ్లు. 


రిషి సునాక్ తల్లితండ్రులు, అత్తామామలు..
రిషి సునాక్ తండ్రి యశ్వీర్ సునాక్ ఒక రిటైర్డ్ డాక్టర్. తల్లి ఉషా సునక్ ఒక ఫార్మసిస్ట్. ఇద్దరూ భారతీయ సంతతి మూలాలు ఉన్న వారే. రిషి సునాక్ ( Rishi Sunak ) సౌత్ఆంప్టన్‌లో జన్మించారు. భారత సంస్కృతి, సంప్రదాయల పట్ల ఇష్టం, అభిమానం, గౌరవం ఉన్న రిషి సునాక్.. ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తి, సుధా మూర్తి దంపతుల కుమార్తె అక్షత మూర్తిని వివాహం చేసుకున్నారు. రిషి సునాక్, అక్షత సునాక్ దంపతుల ప్రేమకు గుర్తుగా క్రిష్ణ, అనౌష్క అని ఇద్దరు కూతుళ్లు పుట్టారు.


Also Read : Rishi Sunak to Kamala Harris: రిషి సునక్ ఒక్కడే కాదు.. విదేశాలను ఏలిన భారతీయుల జాబితా


Also Read : Rishi Sunak Interesting Facts: రిషి సునక్ గురించి చాలా మందికి తెలియని ఆసక్తికరమైన విషయాలు


Also Read : Rishi Sunak: బుద్ది పోనిచ్చుకోని భారతీయులు... గూగుల్ ట్రెండింగ్ లో రిషి సునక్ క్యాస్ట్ సెర్చింగ్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి