Robot: ఇదేం వింత భయ్యా.. పని ఒత్తిడిని భరించలేక రోబో ఏంచేసిందో తెలుసా..?
Robo work pressure: సౌత్ కొరియాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొంత మంది మనుషుల మాదిరిగా రోబోలు కూడా ఇదేం పని చేయడంరా బాబు అంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Robot commits suicide by jumping from stairs in south korea: చాలా మంది ఇటీవల కాలంలో ప్రతిచిన్న విషయానికి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కొందరు పని ఒత్తిడి భరించలేక సూసైడ్ లకు పాల్పడుతున్నారు. మరికొందరు ఎగ్జామ్ లలో ఫెయిల్ అయ్యామని సూసైడ్ లు చేసుకుంటున్నారు. ఇంకొందరు పెళ్లి కుదరట్లేదని, వైవాహిక జీవితం ఆనందంగా లేదని కూడా బాధపడుతుంటారు. ప్రతిదానికి ఎంతో డీప్ గా ఆలోచిస్తుంటారు.దీంతో ఒత్తిడి భరించలేక డీప్రెషన్ లోకి వెళ్లిపోతుంటారు. ఈ క్రమంలో అనుకొని ఘటనలు చోటు చేసుకుంటాయి. కొందరు వర్క్ ప్లేస్ లలో రాజకీయాలతో ఇబ్బందులు పడిపోతుంటారు. ప్రైవేటు కంపెనీలలో పనిభారం దారుణంగా ఉంటుంది.
Read more: Sonu Sood: హీరో సోనూసూద్ కు బంపర్ ఆఫర్ ఇచ్చిన కుమారీ ఆంటీ.. వీడియో వైరల్..
ఈ క్రమంలో కొందరు పనిఒత్తిడిని ఎదుర్కొలేక కూడా తీవ్ర నిరాశకు గురౌతుంటారు. ప్రస్తుతం టెక్నాలజీ మారింది. మనుషులు చేసే అన్ని పనులను, దాదాపు రోబోలు చేస్తున్నాయి. ఆఫీసులలో, హోటల్స్, రెస్టారెంట్లలో రోబోలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. మనుషులు చేసే పనుల కన్నా.. కూడా రోబోలు ఫాస్ట్ గా పనులు చేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా, ఒక రోబో పని ఒత్తిడిని భరించలేక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పూర్తి వివరాలు..
టెక్నాలజీ రోజు రోజుకు మారుతుంది. దీనికి అనుగుణంగా.. ప్రపంచంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. సాంకేతికత కారణంగా, పరిశ్రమలో చాలా రోబోట్‌లను ప్రవేశ పెట్టారు. ఇవి అచ్చం మనుషుల మాదిరిగానే పనిచేస్తున్నాయి. రోబోలు.. మనుషుల కన్నా కూడా వేగంగా, ప్రొడక్టివ్ గా కూడా పనిచేస్తున్నాయి. ప్రస్తుతం సౌత్ కొరియాలోని ఒక కంపెనీలో రోబోను పనిలో పెట్టుకున్నారు.
దాని చిప్ లో ఆవిధంగా మార్పులు కూడా చేశారు. స్థానిక నివేదికల ప్రకారం, గుమి సిటీ కౌన్సిల్‌కి చెందిన ఒక కంపెనీలో.. రోబో ప్రతిరోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇచ్చిన వర్క్ ను ప్రాపర్ గా పూర్తి చేస్తుంది. కానీ ఇటీవల అది పనిభారంతో ఇబ్బంది పడిందంట. అంతేకాకుండా.. దాని చిప్ లో కూడా అనేక మార్పులు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అది ఆఫీస్ బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో దాని పార్ట్ లన్ని కూడా చెల్లా చెదురుగా విరిగిపోయాయి.
Read more: Snakes dance: పాముల సయ్యాట.. పచ్చని పొలంలో అరుదైన ఘటన.. వైరల్ వీడియో..
కొరియన్ రోబో ఆత్మహత్య ఘటన ప్రస్తుతం.. సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం రోబో పై నుంచి కిందపడటానికి గల కారణాలేమిటన్నదానిపై దర్యాప్తు సంస్థ దర్యాప్తు చేస్తోంది. ఈ రోబోను తయారు చేసిన కాలిఫోర్నియా స్టార్టప్ కంపెనీ 'బేర్ రోబోటిక్స్' కూడా దీని ముక్కలను పరిశీలించే పనిలో పడినట్లు సమాచారం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి