Russian president Vladimir Putin: మాస్కో: ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ ( Coronavirus ) మహమ్మారి విలయతాండవం చేస్తోంది. నిత్యం కరోనా కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. అయినప్పటికీ ఏ ఒక్క దేశం నుంచి కూడా ఇప్పటివరకు వ్యాక్సిన్‌ అభివృద్ధి కాలేదు. ఈ నేపథ్యంలో రష్యా నుంచి అన్ని దేశాలకు ఊరట కలిగించే వార్త వెలువడింది. క‌రోనావైర‌స్‌కు వ్యాక్సిన్‌ ( covid-19 vaccine ) ను క‌నుగొన్న‌ట్లు ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ ( Vladimir Putin ) మంగళవారం ప్రకటించారు. ప్ర‌పంచంలోనే మొట్టమొదటిసారిగా కోవిడ్‌-19 వ్యాక్సిన్‌కు ర‌ష్యా ఆరోగ్య శాఖ ఆమోదం తెలిపిన‌ట్లుగా పుతిన్ వెల్ల‌డించారు.  ఆ టీకాను త‌న కూతురికీ కూడా ఇచ్చిన‌ట్లు ఆయన వెల్లడించారు. క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా తన కూతురికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు వెల్లడించారు. మాస్కోకు చెందిన గ‌మేలియా రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, బిన్నోఫార్మ్ కంపెనీ కోవిడ్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశాయి. త్వ‌ర‌లోనే స్పూత్నిక్ టీకాను భారీ స్థాయిలో ఉత్ప‌త్తి చేయ‌నున్న‌ట్లు పుతిన్ వెల్లడించారు.  Also read: India: 45వేలు దాటిన కరోనా మృతులు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనావైర‌స్ సోకిన తరువాత త‌న కూతురికి ఆ వ్యాక్సిన్ ఇవ్వగా.. టెంపరేచర్ తగ్గినట్లు అధ్య‌క్షుడు పుతిన్ వెల్లడించారు. ఈ వ్యాక్సిన్ ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుందన్నారు. రెండు నెలల నుంచి ఈ వ్యాక్సిన్ పరిశోధనలు జరుగుతున్నాయని తెలిపారు.  అయితే.. సెప్టెంబ‌రు నుంచి ఆ వ్యాక్సిన్‌ను మొదట ఆరోగ్య సిబ్బందికి ఇవ్వ‌నున్న‌ట్లు ర‌ష్యా డిప్యూటీ ప్ర‌ధాని త‌త్యానా గొలికోవా, ఆరోగ్య మంత్రి మైఖెల్ మురాష్కో తెలిపారు. జ‌న‌వ‌రి నుంచి సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు ఆ టీకా అందుబాటులో ఉంటుంద‌ని వెల్లడించారు. Also read: Chidambaram: హిందీ నేర్చుకున్నవారు.. ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోరు?


ఇదిలాఉంటే.. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే కరోనా కేసుల సంఖ్య రెండు కోట్లు దాటింది. ఇప్పటివరకు మరణాల సంఖ్య 7లక్షలు దాటింది. Also read: China: మరో చిన్న, నిరుపేద దేశంపై కన్నేసిన చైనా