మాస్కో: రష్యాలోని కేమోరోవోలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ షాపింగ్‌మాల్‌లో జరిగిన ఈ దుర్ఘటనలో 37 మంది చనిపోగా, 40 మందికి పైగా గాయపడ్డారు. అటు ఈ ఘటనలో మరో 70 మంది ఆచూకీ గల్లంతైనట్లు తెలుస్తోంది. మల్టీప్లెక్సులో సినిమా చూస్తున్న సమయంలో ఈ ఘటన జరగడంతో చాలా మంది అక్కడికక్కడే చనిపోయినట్లు సహాయక బృందాలు తెలిపాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. అగ్నిమాపక సిబ్బంది హెలికాప్టర్‌ల సహాయంతో మంటలను ఆర్పుతున్నారు. ఘటనాస్థలికి రష్యా అత్యవసర సేవల మంత్రి, వ్లాదిమిర్ పుట్చ్కోవ్  వెళ్ళారని, అక్కడి పరిస్థితిని సమీక్షిస్తున్నారని రష్యా అత్యవసర సేవల మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.