Russia-Ukraine war: ఉక్రెయిన్‌లో చిక్కున్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నాల్లో భాగంగా...219 మందితో తొలి విమానం ఇండియాకు రానున్నట్లు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ (External Affairs Minister Dr S. Jaishankar ) తెలిపారు. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఇప్పటికే రొమేనియా ( Romania) బోర్డర్ కు చేరుకున్న 219 మందితో తొలి విమానం ముంబయికి బయల్దేరినట్టు ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు. సాయంత్రం 6:30 గంటలకు విమానం ముంబైలో ల్యాండ్ అవుతుంది. అందరినీ సురక్షితంగా స్వదేశానికి చేర్చేందుకు అహర్నిశలు కృషిచేస్తున్నట్లు ఆయన తెలిపారు. స్వయంగా తానే పర్యవేక్షిస్తున్నానని కేంద్రమంత్రి అన్నారు.  భారతీయుల తరలింపులో మంచి సహకారం అందించిన రొమానియా విదేశాంగశాఖ మంత్రి బోగ్దాన్‌ అరెస్కూకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఫిబ్రవరి 24నే ఉక్రెయిన్ ఎయిర్ స్పేస్ మూసివేశారు. 


ఉక్రెయిన్‌లో 423 మంది ఏపీ విద్యార్థులు
ఉక్రెయిన్‌లో (Ukraine) చిక్కుకున్న 423 మంది ఆంధ్రప్రదేశ్ విద్యార్థులను (AP Students) మ్యాపింగ్‌ చేసినట్లు ఏపీ రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు తెలిపారు. వారికి వాట్సాప్‌ గ్రూప్‌ ద్వారా సూచనలిస్తున్నట్లు తెలియజేశారు. విద్యార్థులు తప్ప ఉక్రెయిన్‌లోని ప్రవాసాంధ్రులు మమ్మల్ని సంప్రదించలేదని ఆయన అన్నారు.  ఉక్రెయిన్‌లో ఎంతమంది ఆంధ్రులు ఉన్నారనే వివరాలను సేకరిస్తున్నామన్నారు. 


Also Read: Russia Ukraine War: ఉక్రెయిన్‌లో రష్యా చర్యలపై UN భద్రతా మండలిలో ఓటింగ్‌.. భారత్, చైనా దూరం..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి