Russia-Ukraine War : మాతృభూమి ఉక్రెయిన్‌ను రష్యా ఆక్రమణ నుంచి కాపాడుకునేందుకు వెన్ను చూపని వీరుడిలా పోరాడుతున్నారు ఆ దేశాధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ. రష్యా వెనక్కి తగ్గే సూచనలు కనిపించకపోవడంతో జెలెన్‌స్కీ ఉక్రెయిన్‌ను వీడి పోలాండ్‌కి పారిపోయినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే తానెక్కడికి పారిపోలేదని.. ఇప్పటికీ ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోనే ఉన్నానని జెలెన్‌స్కీ వెల్లడించారు. అమెరికా సెనేటర్స్‌తో జూమ్ కాల్‌లో సమావేశమైన వీడియోని జెలెన్‌స్కీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజా సమావేశంలో జెలెన్‌స్కీ అమెరికాకు కొన్ని కీలక విజ్ఞప్తులు చేశారు. ఉక్రెయిన్ గగన తలాన్ని నో-ఫ్లై జోన్‌గా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే రష్యా చమురు ఉత్పత్తులపై నిషేధం విధించాలని, అక్కడ వీసా, మాస్టర్‌కార్డ్‌ల వినియోగాన్ని నిలిపివేయాలని కోరారు. రష్యాతో పోరాడేందుకు తమకు యుద్ధ విమానాలను అందించాలని కోరారు. ఇదే సమావేశంలో జెలెన్‌స్కీ కొన్ని భావోద్వేగపూరిత వ్యాఖ్యలు చేశారు. బహుశా తనను సజీవంగా చూడటం ఇదే చివరిసారి అవుతుందేమోనని పేర్కొన్నారు. 


అమెరికా సెనేటర్స్‌తో జెలెన్‌స్కీ వర్చువల్‌ సమావేశం జరుగుతుండగా.. ఆ వివరాలను సోషల్ మీడియాలో షేర్ చేయవద్దని ఉక్రెయిన్ రాయబారి ఒకరు విజ్ఞప్తి చేసినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. జెలెన్‌స్కీ భద్రత రీత్యా ఈ విజ్ఞప్తి చేసినట్లు తెలిపింది. అయితే అందుకు విరుద్ధంగా జెలెన్‌స్కీతో సమావేశమైన సెనేటర్స్‌లో ఇద్దరు.. సమావేశం జరుగుతుండగానే స్క్రీన్ షాట్స్‌ను ట్విట్టర్‌లో షేర్ చేశారు. 



అమెరికా సెనేటర్స్‌తో సమావేశం ముగిసిన కొద్ది గంటలకు జెలెన్‌స్కీ సైతం ఆ వీడియోని తన ఇన్‌స్టాలో షేర్ చేయడం గమనార్హం. జెలెన్‌స్కీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నప్పటికీ.. ఆయన లైవ్ లొకేషన్ వివరాలను మాత్రం ఉక్రెయిన్ బయటకు పొక్కనివ్వట్లేదు. రష్యా మొదటి టార్గెట్ జెలెన్‌స్కీ కాబట్టి ఆయన ఆచూకీ బయటకు రాకుండా జాగ్రత్తపడుతోంది. రష్యా ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రారంభించాక ఇప్పటివరకూ మూడుసార్లు హత్యాయత్నం నుంచి జెలెన్‌స్కీ తప్పించుకున్నారు. దీంతో ఆయన సెక్యూరిటీపై ఉక్రెయిన్ వర్గాలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. 


Also Read: Kurnool: బస్సు సీట్ల కింద భారీ నగదు.. బనియన్లలో బంగారం.. స్వాధీనం చేసుకున్న అధికారులు 


Also Read: Wife Illicit Affair: బాబాయితో అక్రమ సంబంధం.. ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య..  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook