Wife Illicit Affair: బాబాయితో అక్రమ సంబంధం.. ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య..

Wife Murders husband over illicit affair: వరుసకు బాబాయి అయ్యే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ భార్య.. విషయం భర్తకు తెలియడంతో అతన్ని దారుణంగా హత్య చేసింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 6, 2022, 11:32 AM IST
  • బాబాయితో మహిళ వివాహేతర సంబంధం
  • భర్తకు తెలియడంతో ప్రియుడితో కలిసి అతన్ని చంపిన భార్య
  • ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో వెలుగుచూసిన ఘటన
Wife Illicit Affair: బాబాయితో అక్రమ సంబంధం.. ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య..

Wife Murders husband over illicit affair: ఖమ్మం జిల్లాలో దారుణం వెలుగుచూసింది. ప్రియుడి మోజులో పడిన ఓ మహిళ అతనితో కలిసి భర్తను దారుణంగా హతమార్చింది. బాబాయి వరుసయ్యే వ్యక్తితో ఆమె వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. వేధింపులు తాళలేకనే భర్తను హత్య చేసినట్లు మొదట చెప్పినప్పటికీ.. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నందుకే అతన్ని హత్య చేసినట్లు విచారణలో తేలింది.

వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం కుర్నవల్లి గ్రామంలో ఈ నెల 26న ఇనుపనూరి జయరాజు అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. జయరాజును తానే రోకలిబండతో కొట్టి హత్య చేసినట్లు అతని భార్య నిరోషా పోలీసులతో చెప్పింది. తాగుడుకు బానిసై వేధింపులకు గురిచేస్తున్నందువల్లే హత్యకు పాల్పడినట్లు చెప్పింది. హత్య ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిరోషాను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం బయటపడింది.

బాబాయి వరుసయ్యే మాడుగుల కృష్ణ అనే వ్యక్తితో నిరోషా వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ నెల 26న ఈ ఇద్దరు ఏకాంతంగా గడుపుతున్న సమయంలో నిరోషా భర్త జయరాజు గమనించాడు. దీంతో ఇద్దరితో గొడవకు దిగాడు. ఈ క్రమంలో జయరాజుపై నిరోషా ప్రియుడు దాడికి పాల్పడ్డాడు. దాడిలో జయరాజు కింద పడిపోగా.. నిరోషా రోకలిబండతో అతనిపై దాడి చేసింది. దీంతో జయరాజు స్పృహ కోల్పోగా.. ఆపై నిరోషా, ఆమె ప్రియుడు కృష్ణ కలిసి అతనికి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. విచారణలో నిరోషా వెల్లడించిన విషయాలతో మరో నిందితుడు కృష్ణను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరినీ మధిర కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయస్థానం ఆదేశాల మేరకు రిమాండుకు తరలించారు. 

Also Read: INDW vs PAKW: హాఫ్ సెంచరీలతో ఆదుకున్న పూజా, స్నేహ్.. పాకిస్తాన్‌కు భారీ టార్గెట్!!

Also Read: IND vs SL: భారత్ తొలి ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేయడానికి కారణం ఏంటో చెప్పిన రవీంద్ర జడేజా!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x