Putin Wax Statue: ఆ మ్యూజియంలో పుతిన్ మైనపు విగ్రహం తొలగింపు- జెలన్​స్కీకి చోటు?

Putin Wax Statue: రష్యా ఉక్రెయిన్​ మధ్య యుద్ధం నేపథ్యంలో పారిస్​లోని గ్రెవిన్ మ్యూజియం కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ విగ్రహాన్ని తొలగించాలని నిర్ణయించింది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 3, 2022, 11:40 PM IST
  • పారిస్ మ్యూజియంలో పుతిన్​ మైనపు విగ్రహం తొలగింపు
  • రష్యా.. ఉక్రెయిన్​పై దాడులు చేస్తుండటమే కారణం
  • ఆయన స్థానంలో ఉక్రెయిన్ అధ్యక్షుడికి స్థానం!
Putin Wax Statue: ఆ మ్యూజియంలో పుతిన్ మైనపు విగ్రహం తొలగింపు- జెలన్​స్కీకి చోటు?

Putin Wax Statue: ఉక్రెయిన్​పై రష్యా దాడులక వారం రోజులు దాటింది. రష్యా దాడులను ఆది నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్న యురోపియన్ దేశాలు.. ఆంక్షలు విధిస్తూ వస్తున్నాయి. రష్యా ఖాతాలను నిలిపివేయడం వంటి చర్యలకు దిగుతున్నాయి.

తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​కు సంబంధించి ఓ కీలక నిర్ణయం తీసుకుంది ఫ్రాన్స్ రాజధాని పారిస్​లో ఉన్న 'గ్రెవిన్ మ్యూజియం'లో పుతిన్ మైనపు విగ్రహాన్ని తొలగించాలని నిర్ణయించింది. ఈ మేరకు గ్రెవిన్ మ్యూజియం డైరెక్టర్​ పుతిన్ మైనపు విగ్రహాన్ని తొలగిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

ఫిబ్రవరి 24 నుంచి ఉక్రెయిన్​పై రష్యా దాడులు ప్రారంభించగా.. వివిధ దేశాలు రష్యాను వ్యతిరేకించాయి. అంక్షలు విదిస్తున్నా రష్యా మాత్రం వెనక్కి తగ్గడం లేదు. దీనితో పుతిన్​ నియంతృద్వ పోకడలకు పోతున్నట్లు విమర్శలు చేస్తున్నాయి యురోపియన్ దేశాలు.

ఈ నేపథ్యంలో పుతిన్ మైనపు విగ్రహాన్ని తొలగిస్తున్నట్లు తెలిపిన గ్రెవెన్​ మ్యూజియం. 'హిట్లర్ వంటి నియంతలకు ఎప్పుడు చోటు ఇవ్వలేదు. ఇప్పుడు పుతిన్​కు కూడా మా మ్యూజియంలో చోటు ఇవ్వాలనుకోవడం లేదు' అని చెప్పుకొచ్చింది. తదుపరి నోటుసులు వచ్చే వరకు పుతిన్ విగ్రహాన్ని వైర్​హౌజ్​లో పెట్టాలని నిర్ణయించినట్లు మ్యూజియం డైరెక్టర్ వెల్లడించారు. పుతిన్ విగ్రాన్ని 2000 సంవత్సరంలో రూపొందించినట్లు వివరించారు. ఇక పుతిన్​ విగ్రాన్ని తొలగించడంతో.. ఏర్పడిన ఖాళీ స్థలంలో.. ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలన్​స్కీ విగ్రహం పెట్టే అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చారు.

గత వారం రోజులుగా మ్యూజియాన్ని సందర్శించిన వారిలో కొంత మంది పుతిన్ విగ్రహంపై దాడి చేశారని తెలిపారు మ్యూజియం డైరెక్టర్​. అయితే దాడి తర్వాత పుతిన్​ జుట్టును, విగ్రహాన్ని సరిచేయాలని తమ స్టాఫ్​ భావించలేదని చెప్పారు. పుతిన్​పై పెరిగిన వ్యతిరేకతే ఇందుకు కారణమని వివరించారు.

Also read: Ukraine Crisis: రష్యన్ మిలటరీ ట్యాంకును ఎత్తుకెళ్లిన ఉక్రెయిన్‌ రైతు, వీడియో వైరల్

Also read: Indians In Ukraine: షాకింగ్ న్యూస్! ఉక్రెయిన్ నుంచి వెళ్లాలనుకునే ఇండియన్స్‌ని కొడుతున్నారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News