Huge amount of Gold and Cash seized in Kurnool: కర్నూలు జిల్లాలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అక్రమంగా తరలిస్తున్న భారీ నగదు, బంగారాన్ని స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పంచలింగాల చెక్ పోస్టు వద్ద బస్సును తనిఖీ చేసిన అధికారులు ఐదుగురు ప్రయాణికుల వద్ద ఈ బంగారం, నగదు గుర్తించారు. సుమారు 8.250 కిలోల బంగారు బిస్కెట్లు, 28.5 కిలోల వెండి, రూ.90 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.5 కోట్ల వరకు ఉండవచ్చునని అంచనా వేశారు.
ఆ ఐదుగురు ప్రయాణికులు హైదరాబాద్ నుంచి కోయంబత్తూరు వెళ్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. బస్సులో వీరు కూర్చొన్న సీట్ల కింద డబ్బు, ప్రత్యేకంగా తయారుచేయించిన బనియన్లలో బంగారు బిస్కెట్లను దాచినట్లు గుర్తించారు. డబ్బు, బంగారానికి సంబంధించి ఆ వ్యక్తుల వద్ద ఎటువంటి లెక్కా పత్రం లేదని తేల్చారు. ఆ ఐదుగురిని అదుపులోకి తీసుకుని స్థానిక పోలీసులకు అప్పగించారు.
పోలీసులు ఆ ఐదుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పట్టుబడిన నగదు, బంగారానికి సంబంధించి సరైన డాక్యుమెంట్స్ సమర్పిస్తే ఆ ఐదుగురిని విడుదల చేస్తామని పోలీసులు చెప్పినట్లు తెలుస్తోంది. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. ఆ ఐదుగురు హైదరాబాద్‌లోని వివిధ బంగారం షాపుల్లో ముడి బంగారం, వెండిని కొనుగోలు చేసి తమిళనాడులో వాటిని ఆభరణాలుగా తయారుచేసి విక్రయిస్తున్నట్లు తేలింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Also Read: Wife Illicit Affair: బాబాయితో అక్రమ సంబంధం.. ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య..
Also Read: Afghanistan Crisis: పాకిస్తాన్ చెత్త గోధుమలు పంపించింది... భారత్ గోధుమలు సూపర్..: తాలిబన్ అధికారి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook