Russian Tycoon Puts $1M Bounty on Putin's Head: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తలపై ఆ దేశ వ్యాపారవేత్త అలెక్స్ కొనానిఖిన్ (Alex Konanykhin) 1 మిలియన్ డాలర్ల బహుమతిని ప్రకటించారు. పుతిన్‌ను (Russian President Vladimir Putin)  యుద్ధ నేరస్తుడిగా అరెస్ట్‌ చేసినా లేదా చంపేసినా ఆ సొమ్మును ఇస్తానని సైనికాధికారులకు ఆఫర్ ఇచ్చాడు. ఫేస్‌బుక్‌ వేదికగా ఆయన ఈ సంచలన ప్రకటన చేశాడు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా రష్యాను వీడి అమెరికాలో ఉంటున్నాడు  కొనానిఖిన్‌. అతడికి క్రిప్టో ఇన్వెస్టర్‌గా మంచి పేరుంది. అక్కడి వ్యాపారస్తులతో మంచి పరిచయాలు ఉన్నాయి. అతని ప్రస్తుత సంపద విలువ 300 మిలియన్‌ డాలర్లుగా ఉంది. తాజాగా పుతిన్‌కి వ్యతిరేకంగా గళం విప్పాడు. తాజా పరిస్థితులను చూస్తూ చేతులు కట్టుకుని ఉండలేనంటున్నాడు కొనానిఖిన్‌.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 కొనానిఖిన్‌ ఫేస్‌బుక్‌లో చేసిన పోస్టులో... రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి స్వేచ్ఛాయుత ఎన్నికలు లేకుండా చేశాడు పుతిన్. తనని తాను జీవితకాల అధ్యక్షుడిని ప్రకటించుకున్నాడు. అకారణంగా ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించి వేల మందిని బలి తీసుకుంటున్నాడు. ఒక రష్యన్‌ పౌరుడిగా నా దేశాన్ని నాజియిజం నుంచి కాపాడాల్సిన నైతిక బాధ్యత నాకుంది. అందుకే యుద్ధ నేరస్తుడిగా పుతిన్‌ని అరెస్ట్‌ చేసినా అధికారులకు 1 మిలియన్‌ డాలర్లు బహుమతిగా ఇస్తానని ప్రకటించారు. అంతేకాకుండా ఉక్రెయిన్‌ పౌరులకు సంఘీభావం ప్రకటించారు. కొనానిఖిన్‌.. 1999 నుంచి అమెరికాలో (America) ఆశ్రయం పొందుతున్నాడు.


Also Read: Russia Captures Kherson: పోర్టు సిటీ 'ఖేర్సన్'​ రష్యా హస్తగతం.. కీవ్​ స్వాధీనం దిశగా అడుగులు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి