United Nations: ఐక్యరాజ్యసమితి వేదికగా ఉగ్రవాదంపై పాకిస్థాన్‌ను తప్పుబట్టిన భారత్
పాకిస్థాన్ నాయకులు భారత్ పై బురద జల్లటం, ప్రపంచానికి దోషిలా ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ వేదికగా చూపించటం ఇదేం మొదటిసారి కాదు. మొదటగా భారత్ భూభాగంలో అక్రమంగా ఆక్రమించిన కాశ్మీర్ వదిలి వెళ్లాలని ఇండియన్ ఫస్ట్ సెక్రటరీ స్నేహా దూబే డిమాండ్ చేశారు.
United Nations General Assembly: అంతర్జాతీయ వేదికపై పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Pakistan's Prime Minister Imran Khan) మరోసారి భారత్‌పై విరుచుకుపడ్డారు, అయితే దానికి ప్రతిస్పందనగా భారత ఫస్ట్ సెక్రటరీ (Indian First Secretary Sneha Dubey) స్నేహా దూబే అదే రీతిలో జావాబు ఇచ్చారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 76 వ సెషన్‌లో ప్రసంగించినప్పుడు, కాశ్మీర్ సమస్యపై ఇమ్రాన్ భారతదేశాన్ని తప్పుగా చూపించటానికి ప్రయత్నించాడు. దానికి బదులుగా స్నేహ దూబే వారి తప్పులను ఎత్తిచూపింది. అంతేకాకుండా, పాకిస్థాన్ ఉగ్రవాదానికి వెన్నుదండుగా ఉందని, బహిరంగంగానే ఉగ్రవాదానికి మద్దతు తెలిపి పెంపు పోషిస్తుందని ఈ విషయం ప్రపంచ దేశాలకు తెలుసని తెలిపారు. మొదటగా భారత్ భూభాగంలో అక్రమంగా ఆక్రమనించిన కాశ్మీర్ వదిలి వెళ్లాలని ఇండియన్ ఫస్ట్ సెక్రటరీ స్నేహా దూబే డిమాండ్ చేశారు.
ద్వేషించే హిందూత్వ భావజాలం భయాన్ని సృష్టించింది
ఐక్యరాజ్యసమితిలో ఇస్లామోఫోబియాపై (Islamophobia) ఆందోళన వ్యక్తం చేసిన ఇమ్రాన్ మత సామరస్యంపై కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని వ్యక్తం చేశారు. దీంతో పాటు భారతదేశంపై బురద జల్లటం ఆపలేదు. పాక్ ప్రాధాని ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ... "భారతదేశంలో రాజ్యం ఏలుతున్న బిజెపి (BJP) ప్రభుత్వం 'ఇస్లామోఫోబియా' పెంపోందిస్తుందని, ద్వేషంతో నిండిన ఆర్ఎస్ఎస్-బిజెపి (RSS-BJP) కలిసి వ్యాప్తి చేసిన హిందూత్వ భావజాలం దేశంలోని 200 మిలియన్ల ముస్లింలపై భయం మరియు హింసను సృష్టించిందని" పేర్కొన్నారు.
Also Read: MAA Elections 2021 : మా ఎన్నికల కోసం బండ్ల గణేశ్ వినూత్న ప్రచారం
భారత సైనికులపై ఉల్లంఘన ఆరోపణలు
ఆగస్టు 5, 2019 నుండి, జమ్మూ కాశ్మీర్‌లో భారత్ చట్టవిరుద్ధమైన, ఏకపక్ష చర్యలు తీసుకుందని మరియు 9 లక్షల మంది సైనికులను మోహరించడం ద్వారా భీభత్సం శృష్టించిందని ఇమ్రాన్ ఆరోపించారు. "కాశ్మీర్ నాయకులు అరెస్టు చేయబడ్డారు, మీడియా మరియు ఇంటర్నెట్ తో సహా అన్ని రకాల సేవలు నిషేధించబడ్డాయని, ప్రజలు చేసే శాంతియుత ప్రదర్శనలు హింసతో అణచివేయబడ్డాయని" ఇమ్రాన్ పేర్కొన్నారు. అంతేకాకుండా, "13 మంది కశ్మీరీ యువకులను అరెస్టు చేసి చిత్రహింసలకు గురి చేశారని, వారిని తీవ్రవాదులుగా చిత్రీకరించి ఎన్‌కౌంటర్లు చేస్తున్నారని పాక్ ప్రధాని ఆరోపించారు". కాశ్మీర్ లో భారత సైన్యం మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతోందని, ఆ ప్రాంతంలో నివసించే ముస్లింలను మైనారిటీలుగా మార్చటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఇమ్రాన్ పేర్కొన్నారు.
పాకిస్థాన్ ప్రధానికి తగిన జవాబు చెప్పిన స్నేహా దూబే
భారత ప్రథమ కార్యదర్శి స్నేహా దూబే (India's First Secretary Sneha Dubey) చేసిన ప్రసంగంలో ఇమ్రాన్ ఖాన్ ఆరోపణలన్ని అవాస్తవాలుగా నిరూపించబడ్డాయి. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ వేదికగా (UN platform)"పాకిస్థాన్ నాయకులు భారత్ కు వ్యతిరేకంగా మాట్లాడం, మా దేశంపై బురద జల్లటం, ప్రపంచానికి దోషిలా చూపించటం ఇదేం మొదటిసారి కాదు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్... ప్రపంచ దేశాలను దృష్టి మళ్లించడానికే భారత్ పై తప్పుడు ఆరోపణల చేస్తుంది. వాళ్లు మద్దతు తెలుపుతున్న ఉగ్రవాదం కారణంగా పాకిస్థాన్ లో సాధారణ ప్రజలు, ముఖ్యంగా మైనారిటీల ప్రజల జీవితాలు కష్టంగా మారాయని" స్నేహా దూబే తెలిపారు.
Also Read: Modi : ప్రపంచ శాంతి కోసం క్వాడ్ కూటమి కృషి - ప్రధాని మోదీ
ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చిందని నిరూపణలు
ఉగ్రవాదులకు ఆశ్రయం, సహాయం మరియు బహిరంగ మద్దతు అందించడమే పాకిస్థాన్ చరిత్ర మరియు విధానమని ఈ విషయం ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సభ్యులకు తెలుసని స్నేహ అన్నారు. ఉగ్రవాదులకు మద్దతు, శిక్షణ, ఆర్థిక సాయం మరియు ఆయుధాలను అందించడమే పాకిస్థాన్ ప్రభుత్వ విధానమని ప్రపంచం దేశాలకు తెలుసు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ఉగ్రవాదులుగా గుర్తించిన
వారికి ఆశ్రయం కల్పించే సిగ్గుమాలిన దేశం మీదని స్నేహ మండిపడ్డారు.
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ను ఖాళీ చేయండి
స్నేహ ఐక్యరాజ్యసమితితో (United Nations) మాట్లాడుతూ... "కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూ కాశ్మీర్ మరియు లడఖ్ (Union Territories of Jammu and Kashmir and Ladakh) భారతదేశంలో అంతర్భాగాలు. పాకిస్థాన్ అక్రమంగా ఆక్రమించిన ప్రదేశాల్లో ఇవి కూడా ఉన్నయాని... తక్షణమే వాటిని ఖాళీ చేసి వెళ్లాలని స్నేహ డిమాండ్ చేశారు. ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) భారత్ పొరుగున ఉన్న ఇతర ఐదు దేశాలతో పాటు పాకిస్థాన్ తో కూడా సత్సంబంధాలు మెరుగుపడే దిశగా చర్యలు తీసుకోవాలని తెలిపారు... కానీ అలాంటి వాతావరణాన్ని ఏర్పడాలంటే, మీ దేశం నుండి భారత సరిహద్దు దాటి మా దేశంలో ఎలాంటి ఉగ్రవాదం (Terrorism ) జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవడం పాకిస్తాన్ బాధ్యత అని స్నేహా తెలిపారు.
Also Read: Coronavirus New Variant: కరోనా వైరస్ కొత్త వేరియంట్ జాడ ఇండియాలో ఉందా లేదా
స్నేహ దూబే ఎవరు?
భారతదేశం తరపున, ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ఫస్ట్ సెక్రటరీగా (First Secretary in the United Nations General Assembly) పాల్గొంటున్న స్నేహా దూబే (Sneha Dubey) 2011 సంవత్సరంలో మొదటి ప్రయత్నంలోనే సివిల్ సర్వీసెస్ పరీక్షలో (Civil Services Examination) ఉత్తీర్ణులయ్యారు. గోవాలో (Goa) పెరిగిన స్నేహ, పుణెలోని (Pune) ఫెర్గూసన్ కాలేజీ (Fergusson College) నుండి గ్రాడ్యుయేట్ అయిన తర్వాత న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ విశ్వవిద్యాలయం (Delhi's Jawaharlal University) నుండి భూగోళశాస్త్రంలో మాస్టర్స్ ( Masters in Geography) చేసింది. అంతర్జాతీయ సమస్యలపై స్నేహాకు ఉన్న ఆసక్తి కారణంగా, ఆమె జెఎన్‌యులోనే స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్‌లో (School of International Studies in JNU) ఎంఫిల్ చదువును (MPhil studies) పూర్తి చేసింది . ట్రావెలింగ్ ను ఇష్టపడే స్నేహ, IFS గా మారడం దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం రావటం అదృష్టంగా భావిస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook