Black Snow in Russia: ప్రస్తుతం చాలా దేశాల్లో చలికాలం పీక్​ స్టేజిలో నడుస్తోంది. దీనితో ఆయా దేశాల్లో మంచు విపరీతంగా కురుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రష్యా లాంటి దేశాల్లో  సాధారణంగానే ఎక్కువగా మంచు (Snow Falling in Russia) కురుస్తోంది. అలానే ఈ సారి కూడా మంచు కురుస్తోంది. ఇందులో ప్రత్యేకత ఏముందని అనుకుంటున్నారా?


అయితే ఈ సారి మంచు కురుస్తోంది బ్లాక్ కలర్​లో. అదేమిటి మంచు అంటే సాధారణంగా తెలుపు రంగులో కదా ఉంటుంది? నలుపు రంగులు కురవడం ఏమిటి? అనుకుంటున్నారు కదా? అవును మీరు చదివింది నిజమే.. తూర్పు రష్యా సైబీరీయన్ ప్రాంతాల్లో మంచు నలుపు రంగులో (Black Snow) కురుస్తోంది.


అక్కడి స్థానికిలు ఉదయం లేచి చూడగానే పరిసరాలన్నీ నల్లగా మారిపోయి ఉన్నాయి. పిల్లలు ఆ నల్లటి మంచులో అయిష్టంగానే ఆడుకుంటున్నారని స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కొంత మంది అధికారులు, నిపుణులు వివరణ ఇచ్చారు.


మంచు నల్లగా మారడానికి కారణాలు ఏమిటంటే..


'శీతాకాలంలో ఆయా ప్రాంతాల్ల పూర్తిగా గడ్డకట్టుకుపోతుంది. కొన్న సార్లు ఈ ప్రాంతంలో ఊష్ట్రోగ్రతలు -50 వరకు  పడిపోతుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో స్థానిక ప్రజలకు నీరు అందించేందుకు ఓ వేడి నీటి ప్లాంట్లు అక్కడ పని చేస్తుంటాయి.చట్టుపక్కల జనాలందరికీ ఈ ప్లాంట్ల​ నుంచే నీళ్లు సరఫరా అవుతాయి. అయితే వాటర్ ప్లాంట్లు​ బొగ్గును మండించడం ద్వారా పని చేస్తాయి. దీనితో ప్లాంట్లు నిరంతరాయంగా పని చేయాలంటే.. బొగ్గును భారీగా కాల్చాల్సి వస్తోంది. అయితే బొగ్గును ఎక్కువగా కాల్చడం వల్ల అది పొగరూపంలో గాల్లోకి వెళ్లి మంచుతో పూర్తిగా కలిసిపోతోంది. ఫలితంగా పొగతో కలిసిన మంచు నలుపు రంగులోకి మారి భూమిపై కురుస్తోంది.' అని చెప్పారు (Why black snow falling in Russia) విశ్లేషకులు.


అయితే ఈ ఇది ఇప్పటి సమస్య కాదని కొందరు స్థానికులు వాపోతున్నారు. గత కొన్నేళ్లుగా ఈ సమస్య ఉందని ఫిర్యాదు చేసినా పరిష్కారం మాత్రం లభించలేదని చెబుతున్నారు. దీని వల్ల ఆరోగ్య పరమైన సమస్యలు వస్తాయని (Russians on Black Snow) భయపడుతున్నారు.


Also read: King Cobra: హ్యాట్సాఫ్ భయ్యో.. కరవడానికి మీదికొస్తున్న భారీ కింగ్ కోబ్రాను ఒట్టి చేతులతో పట్టేశాడు (వీడియో)!!


Also read: NeoCov Virus: నియోకోవ్ అన్ని కరోనా వేరియంట్స్ కంటే ప్రాణాంతకమా?.. శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook